నారా లోకేష్ ఎన్నికల నామినేషన్‌కి డుమ్మా కొట్టాడు. అవును మీరు చదివింది నిజమే… 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత త్వరలో జరగబోయే అనగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న నారా లోకేష్ తన ఎన్నికల నామినేషన్ కి డుమ్మా కొట్టాడు. మరో కపక్క ఉదయం నుంచి ఎల్లో మీడియా, టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు నారా లోకేష్ 10,000 బైకులతో ర్యాలీ గా వెళ్లి నామినేషన్ వేస్తాడంటూ ఊదరకొట్టాయి. క్షణం తీరిక లేకుండా చెవులు చిల్లులు పడేలాగా వార్తను తిప్పి తిప్పి చెబుతూ మంగళగిరి ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టాయి.
అయితే ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా అట్టహాసంగా నారా లోకేష్ నామినేషన్ వేస్తాడని ఎదురుచూసిన టీడీపీ క్యాడర్ కి నిరాశ ఎదురైంది. ఈసారి ఎలా అయినా మంగళగిరిలో గెలుస్తాం.. గెలిచి తీరుతామని శపథాలు చేస్తూ కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతున్న లోకేష్… నామినేషన్ వేయటానికి డుమ్మా కొట్టడంపై టీడీపీ కార్యకర్తలు నీరుగారిపోయారు. కాగా తాను నామినేషన్ వేసిన గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి తన బదులు వేరే వారితో నారా లోకేష్ నామినేషన్ వేయించడం గమనార్హం. నామినేషన్ వేసే ముందు నామినేషన్ పత్రాలకు సర్వమత పూజలు నిర్వహించి మరీ నామినేషన్ వేయించారు.. తన చేత్తో నామినేషన్ వేస్తే మంగళగిరిలో గెలవలెనేమో అనే భయం మరియు నమ్మకం కారణంగా నామినేషన్ ప్రక్రియకు డుమ్మా కొట్టి వేరేవాళ్ళతో వేయించాడని పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.. అయినా లోకేష్ పిచ్చి గాని గెలిచే సత్తా ఉండాలి కానీ ఎవరు నామినేషన్ వేసే చేయిలో ఏముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..