తమకు సంబంధం లేని విషయంలో క్రెడిట్ కొట్టేడయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఎప్పుడూ ముందుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విషయాలైనా సరే తమకు అన్వయించుకుని అంతా మా వల్లేనని డబ్బా కొట్టుకుంటుంటారు. ఇక వీరి కోసం ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఉండనే ఉంది. తాజాగా టెస్లా విషయంలో చినబాబు ట్వీట్ వేసి అంతా తన తండ్రి దయవల్లేననే ధోరణిలో మాట్లాడుతున్నాడు.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో ఏపీలో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నెలకొల్పడానికి ఉన్నతాధికారులు సదరు కంపెనీకి ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల తర్వాత స్థల పరిశీలనకు రావాలని ఈ–మెయిల్స్ ద్వారా ఆహ్వానించారు. అనంతపురం జిల్లా కియా ప్లాంట్ సమీపంలో భూములను ప్రతిపాదించారు. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీసిటీల్లో భూములు పరిశీలించాలని చెప్పారు. టెస్లా ప్లాంట్‌కు 2,500 ఎకరాల అవసరం. ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. వాస్తవానికి 2021, 22 సంవత్సరాల్లో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లాను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే కోవిడ్ పరిణామాలతో ఇది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మస్క్ వస్తున్నారని సమాచారం అందడంతో ప్రతిపాదన పంపారు. మరోవైపు కర్ణాకట, తెలంగాణా రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి.
టెస్లా ప్లాంట్ ఏర్పాటు అంశం కేంద్రం చేతిల్లో ఉంది. పన్ను మినహాయింపులపై చర్చలు జరుగుతున్నాయి. దిగుమతి సుంకాలపై రాయితీ ఇవ్వాలని మస్క్ బృందం కోరింది. దీనిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు ముకేష్ అంబానీతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయి. ఇంత కథ నడుస్తుంటే లోకేశ్ ఒక ట్వీట్ చేసి నవ్వుల పాలయ్యాడు. ఒకవేళ టెస్లాకు కేంద్రం గేట్లు తెరిచి ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగుమమైతే ఆ క్రెడిట్ అంతా బాబు ఖాతాలో వేసేందుకు ప్రయత్నించాడు. 2017లో నారు వారు మస్క్‌తో సమావేశమయ్యారని, అప్పుడే ఆయన ఆసక్తి చూపించారని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. టెస్లా రాక కోసం ఎదురు చూస్తున్నట్లు అందులో చెప్పాడు.
లోకేశ్‌కు తెలివి ఎక్కువైపోయింది. అది ఎలాంటిదంటే కియా విషయంలో జనాన్ని గొర్రెలు చేసినట్లు ఈసారి చేద్దామనుకున్నాడు. టెస్లా రావాలంటే ముందు కేంద్రం ఒప్పుకోవాలి. పన్నుల విషయంలో వారి మధ్య చర్చలు విజయవంతం కావాలి. కానీ అప్పుడెప్పుడో చంద్రబాబు కలిశాడు. అందుకే వస్తున్నాడని డబ్బా కొట్టుకుంటున్నాడు లోకేశ్. కియా విషయంలోనూ ఇదే జరిగింది. 2017లో కలిస్తే 2019 వరకు టెస్లా విషయంలో ఎలాంటి అడుగులు ఎందుకు పడలేదో చినబాబు చెప్పాలి. ఎక్కడ ఏపీలో పెట్టేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందని, వెంటనే పచ్చ గ్యాంగ్ రంగంలోకి దిగా మస్క్‌తో బాబు దిగిన ఫొటోను వైరల్ చేస్తోంది. చర్చలు జరిపే నరేంద్రమోదీకి వీరి దృష్టిలో ఏం సంబంధం లేదు. అదే ఏదైనా పరిశ్రమ ఎల్లో సైకోల వల్ల వెళ్లిపోతే మాత్రం ఆ క్రెడిట్ తీసుకోకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంది. ఈ తెలుగు తమ్ముళ్లు చిత్రమైన మనుషులబ్బా..