ఏపీ ఎన్నికల రణ క్షేత్రంలో టీడీపీ మరోసారి పొత్తులకు తెర లేపి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కర్నూలులో జరిగిన ముస్లిం మైనారిటీ వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆధ్వర్యంలో జరిగిన మైనారిటీ మీటింగ్ లో పాల్గొన్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మైనారిటీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంక్ మాదిరిగానే చూసింది. టీడీపీలో మైనారిటీలకు కనీస మంత్రి పదవి ఇవ్వలేదు. పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆఖరికి ఈరోజు ముస్లింలకు వైఎస్ఆర్ గారు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ ను అధికారం లోకి రాగానే తీసేస్తామనే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ కు వస్తుందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే మొదటి చేసే పని బీజేపీ సూచనతో ముస్లింలకు రిజర్వేషన్ తీసెయ్యడం కాబట్టి ముస్లిం సోదరి సోదరీమణులు కలిసికట్టుగా బీజేపీతో జత కట్టిన టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ముస్లింలకు 7 అసెంబ్లీ సీట్లలో పోటీకి అవకాశం కల్పించింది. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఇన్ని సీట్లు ఇచ్చిన నాయకుడు ఎవరు లేరని ఇంతియాజ్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్న సమయంలో గుంటూరులో తమ సమస్యల మీద నిలదీసిన ముస్లిం యువత మీద దేశ ద్రోహం కేసులు పెట్టిన నీచుడు చంద్రబాబు అని అలాగే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి తరుపున ముస్లింలకు కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించారని ఎద్దేవా చేశారు.
నెల్లూరు సిటీలో వైసీపీ ఎమ్మెల్యే గా ఒక సామాన్య ముస్లింకు టికెట్ ఇచ్చారని పార్టీ కి రాజీనామా చేసిన పెత్తందారు అయిన వెమిరెడ్డికి టీడీపీ తరుపున టికెట్ లు కేటాయించిన విషయం మర్చిపోవద్దు. దానికి మనమంతా ఒకటిగా నిలబడి వైసీపీ నాయకులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు . జగన్ ఈ ఐదేళ్ళ ప్రభుత్వ కాలంలో ముస్లింల సంక్షేమానికి 23 వేల కోట్లు ఖర్చు చేశారు అని జగన్ ప్రభుత్వంలో ముస్లిం లకు షాది తోఫా, మౌజమ్ లకు గౌరవ వేతనం కల్పించారని గుర్తు చేశారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని ముస్లిం సామాజిక వర్గం రాష్ట్రం నుండి తరిమెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నదని ఎన్నికల్లో మొదటి సారి ఏడుగురికి అవకాశం ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంతియాజ్ ఆకాంక్షించారు.