ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా నష్టపోయిన సీమాంద్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుని తిరిగి తెలుగు వారి సత్తాని దేశానికి పరిచయం చేస్తూ సగర్వంగా నిలబడాలనే ఆకాంక్ష రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపధ్యంలోనే అనుభవం ఉన్న నాయకుడనే ఒకే కారణంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీమాంద్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అదినాయకుడు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారు.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేవలం అనుభవమనే ప్రాత్రిపదికన స్వల్ప ఆదిక్యతతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు , అధికారంలోకి వచ్చీ రాగానే ఆరాచక పాలనకు తెరలేపారు. ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా మానిఫెస్టోని వెబ్సైట్ నుండి మాయం చేయడంతో ప్రారంభించి ప్రస్నించిన గొంతులని జైల్లో పెట్టించే వరకు సాగించిన అరాచక పాలనతో బాదింపబడ్డ ప్రజలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఓటు అనే ఆయుధం ప్రయోగించి తీవ్రంగా కోలుకోలేని దెబ్బ కొట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్ కి అధికారం ఇచ్చారు.
తెలుగుదేశం పాలనకు బిన్నంగా పూర్తిగా సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్ళుగా చేసుకుని అవినీతనే మరకలేకుండా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది ప్రధంలోకి తెస్తున్న జగన్ పై తెలుగుదేశం పార్టీ తనకు బాకా ఊదే అనుకూల మీడియా సాయంతో అనేక అసత్య ప్రచారాలకి తెరలేపారు. అందులో వారు ముఖ్యంగా లేవనెత్తిన అంశం సంక్షేమం పేరున డబ్బులు పంచే జగన్ రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాన్ని వెనకబాటు తనానికి గురి చేస్తున్నాడని , ఒక్క కంపెనీ కూడ తేలేక రాష్ట్రంలో యువత ఆశలపై నీళ్ళు చల్లారని.
అయితే తెలుగుదేశం చేస్తున్న ఈ ఆరోపణలను ఇన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టిన ఆ పార్టీ క్యాడర్ కి మరింత ఊతం ఇచ్చేలా వైసీపీ పార్టీ సోషల్ మీడియా విభాగం 2019 తరువాత జగన్ పరిపాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది సంక్షేమమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకి అందుబాటులో ఉండేలా ఒక వెబ్సైట్ ని ప్రారంభించింది . జగన్ అన్న కనెక్ట్స్ https://jaganannaconnects.com/ పేరుతో ఉన్న ఈ వెబ్సైట్ లో 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో జరిగిన అభివృద్ది , అలాగే సంక్షేమం వివరాలను లెక్కలతో సహా పొందు పరించింది. రాష్ట్రంలో అభివృద్ది లేదనే వారికి ఒకే క్లిక్ తో సమాధానం చెప్పే విధంగా విప్లవాత్మకమైన అడుగులు వేసి ప్రత్యర్ధులకి సవాల్ విసిరింది వైసీపీ.