AP Schools : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడులు ( AP Schools )కొత్త రూపు సంతరించుకున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన నాడు – నేడు పథకమే దీనికి కారణం. 30, 40 సంవత్సరాల వయసు దాటిన వారికి ఒకప్పుడు సర్కారు పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉండేవో బాగా తెలుసు. వాళ్లు ఇప్పుడు తమ ఊళ్లలోని స్కూళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగులు వేసిన గోడలు, ఆహ్లాకదకర వాతావరణం, మరుగుదొడ్లు, డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్లు, ఫ్యాన్లు, బెంచీలు, ట్యాబ్‌లు, బ్యాగ్‌లు తదితరాలను చూసి సంబరపడిపోతున్నారు. తాము చదువుకునే రోజుల్లో నేలపై కూర్చొనే వారమని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ బాగుపడిన బడుల గురించి ట్విట్టర్లో (ఎక్స్) పంచుకున్నారు. సోమవారం ఆయన తన స్వగ్రామం బాపట్లకు సమీపంలోని కర్లపాళెం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. ఈ సమయంలో ప్రతి తరగతి గదిని చూశారు. బడి మొత్తం తిరిగారు. బల్లలపై కూర్చొని ఫొటోలు దిగి ట్విట్టర్లో పోస్టు చేశారు. అందంగా అధునాతనంగా మారిన కర్లపాళెం ప్రభుత్వ పాఠశాలను చూసి చాలా సంతోషం వేసిందని రాసుకొచ్చారు.
పెత్తందారులకు కనిపించదు
దేశంలో ఈ స్థాయిలో బడుల( AP Schools )ను బాగు చేసిన ప్రభుత్వం లేదని అందరూ కొనియాడుతుంటే మన దగ్గరున్న సినీ నటుడు, పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్‌కు మాత్రం కనిపించదు. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరగడం సహజం. వాటిని బూచిగా చూపించి సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం పవన్‌కు, ఆయన్ను పెంచి పోషిస్తున్న చంద్రబాబుకు అలవాటు. జరిగిన మార్పును స్వాగతించేందుకు వాళ్లకు మనసొప్పదు. పిల్లల విషయంలో కూడా రాజకీయాలు చేసే మనస్తత్వం వారిది. ప్రభుత్వ బడులు బాగుపడినా.. వాటిలో చదివే పేదల పిల్లలు వృద్ధిలోకి వచ్చినా సహించలేని పెత్తందారులు బాబు, పవన్.
Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem