ఈ పేరు ఆంధ్ర మొత్తం తెలుసు. 2018లో జగన్ మీద విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిలో నిందితుడు. నిజానికి సెక్యూరిటీ టైట్ గా ఉండే విమానాశ్రయంలోకి ఇలాంటి కత్తులు నిషిద్ధం. కానీ నిందితుడు విమానాశ్రయంలోని క్యాంటీన్ లో పని చేస్తుండడం, ఆ కాంటీన్ టీడీపీ నాయకుడు హర్షవర్దన్ నడుపుతుండడం గమనించాల్సిన విషయం. ఆ దిశగా విచారణలు జరుగుతున్నాయి. నిందితుడు కోడికత్తి శీనుని అరెస్ట్ చేసి జైలుకు పంపినాక మధ్యలో కొంతకాలం బెయిల్ వచ్చినా, మళ్ళీ ఆ బెయిల్ రద్దయ్యి ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.
అయితే ఈ కేసులో మాకేం సంబంధం లేదని శ్రీను చేత జగనే తన పైన హత్యాయత్నం చేయించుకొన్నాడు అని ఆరోపించిన టీడీపీ పార్టీ 2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరుపున కోడి కత్తి శ్రీనుకి పోటీ చేసే అవకాశం ఇచ్చారని సత్య దూరమైన ఆరోపణలు చేసింది. వాస్తవానికి అతను ఆ సమయంలో జైల్లో ఉండటం గమనార్హం. ఇలా జగన్ పై నిత్యం ఆరోపణలు చేస్తున్న టీడీపీ మాత్రం గత ఆరునెలలుగా ఈ కేసు మీద అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.
అప్పటిదాకా లేని లాయర్లు శ్రీను తరపున వచ్చేశారు. అప్పటిదాకా పట్టించుకోని ఇంట్లో వాళ్లు బయటికి వచ్చేసారు. అప్పటిదాకా పట్టించుకోని మీడియా ఈ విషయం పైన బాగా దృష్టిపెడుతోంది. అప్పటిదాకా శ్రీను వైసీపీ అని ఆరోపించిన టీడీపీ ఇప్పుడు శ్రీను నిర్దోషి అని రచ్చ చేస్తోంది. వీటన్నికీ కారణం టీడీపీ అనే అర్థం చేసుకోవచ్చు మనం.
అయితే ఎందుకు?. దీర్ఘ కాలంగా జైల్లో మగ్గుతున్న శ్రీను ఇహ పై తాను జైల్లో ఉండలేనని తనని బెయిల్ పై బయటకు తీసుకురాకపోతే తాను అప్రూవర్ గా మారి అన్ని విషయాలు వెల్లడించి బెయిల్ పై వస్తానని తన వెనక ఉన్న పెద్దలతో వెల్లడించాడని అంతర్గత వర్గాల సమాచారం .
అదే జరిగితే ఎయిర్ పోర్ట్ లో అతను పని చేసిన ఫ్యూషన్ ఫుడ్స్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ తో పాటు అతని వెనకున్న టీడీపీ పెద్దల హస్తం బయట పడుతుందని కంగారు పడ్డ టీడీపీ హుటాహుటిన బెయిల్ కోసం లాయర్లని పురమాయించడం, అలాగే సానుభూతి కోసం కుటుంబ సభ్యుల చేత నిరాహారా దీక్షల నాటకాలు ఆడించడం చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.