ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో కాపు సామాజిక ఓట్ల పైనే అంతటా చర్చ నడుస్తోంది. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కాపు సామాజిక వర్గపు ఓట్లు కీలకంగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని కాపులు ఇప్పుడు ఎవరికి పట్టం కడతారు అన్నదే ప్రశ్న… మరొకపక్క ఇదే కాపు సామాజిక వర్గంపై ఆధారపడి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంత ఆరాటపడుతున్నాడో చూస్తూనే ఉన్నాం..
ఈనేపథ్యం లో కూటమి వర్సెస్ వైసీపీ పోటీ అత్యంత కీలకంగా మారింది. ఆ క్రమంలో ఎవరి హయాంలో కాపులకు మేలు జరిగింది అనేది ఒకసారి కూలంకషంగా పరిశీలిస్తే… 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సామాజిక వర్గానికి ఏడాదికి 2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 10 వేల కోట్లు సాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే చెప్పిన దానికన్నా ఎక్కువగా ఐదేళ్లలో కాపులకు డీబీటీ ద్వారా 26,233 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 7,772 కోట్లు… ఇలా మొత్తంగా 34,005 కోట్లు సాయం అందించారు. చెప్పిన దానికన్నా జగన్ డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 24 వేల కోట్లు అదనంగా కాపులకు సాయం అందించారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే.. ఏటా 1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు సాయం అందిస్తానని బాబు హామీ ఇచ్చాడు. కానీ, బాబు తన ఐదేళ్ల పాలనలో కాపులకి కేటాయించింది కేవలం 1,340 కోట్లు మాత్రమే… జగన్ ఇచ్చిన మాట తప్పకుండా తాను చెప్పిన దాని కంటే ఎక్కువ లబ్ధి చేకూర్చాడు. ప్రస్తుతం వాడి వేడిగా సాగుతున్న ఎన్నికల సమయంలో కాపు ఓట్లు కీలకంగా మారాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాపులకు చెప్పిన దానికన్నా ఎక్కువ సాయం అందించి మేలు చేసిన జగన్ వైపు ఉంటారా లేక కాపులకు చిన్న మాటను నెరవేర్చకుండా మోసం చేసి వంచించిన బాబు వైపు ఉంటారా అనేది రేపు జరగబోయే ఎన్నికల్లో తేలనుంది.