చంద్రబాబు దేహమంతా దళితుల రక్తంతోనే తడిసిందని జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు . కారంచేడు,చుండూరు,పదిరికుప్పం బాబు సామాజికవర్గ దాష్టీకాలేనని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా, దళితుల్ని ముక్కలుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్తచరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయన్నారు. వైఎస్ కుటుంబానికి దళితులు బంధువులు-ఆత్మ బంధువులు, దళితులని దగ్గరికి వైఎస్ కుటుంబం చాలా దగ్గరికి తీసుకుంది. దళితులని దగ్గరికి తీసుకున్న ఏ ఒక్క సంఘటనైనా చంద్రబాబు దగ్గర ఉందా అని జూపూడి ప్రశ్నించారు.
చంద్రబాబుకు దళితులంటేనే గిట్టని వ్యవహారం. ఆయన మాకు చేసిన మేలేం లేదు. ఆయన రక్తంలోనే ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకత ఉందని జూపూడి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నోరుపారేసుకున్నాడు. అంటే, ఆ స్థాయి వ్యక్తే అంత మాటన్నప్పుడు ఎస్సీలు ఆత్మగౌరవంతో ఎలా బతకగలరనే కనీస ఆలోచన చేయకుండా మాట్లాడే స్వభావం ఆయనది అన్నారు.
ఇటీవల ఎస్సి కులానికి చెందిన వ్యక్తికి శింగనమలలో టికెట్ ఇస్తే ఆయన చేసుకునే వృత్తిని కూడా తప్పుపట్టే నైజం చంద్రబాబుదని దుయ్యబట్టారు . బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. ఇలాంటి నీచ వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబుని మనమందరం రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు.
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదలకు అండగా ఉండే సీఎం జగన్ కు మనమందరం తోడుగా నిలబడాలని తెలిపారు. సామాజిక న్యాయ సూత్రాలను అమలు చేస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు
సీఎం జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడని అందుకే విజయవాడలో ఆయన్ను హత్య చేయాలని చూశారని జూపూడి ఆరోపించారు. జగన్ నుదిటి భాగంలో రాయి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే కణతకి తగిలుంటే పరిస్థితి ఊహించలేమన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసి ఈ దాడి వెనుక ఉన్న వారిని పట్టుకోవాలని పోలీసు శాఖను కోరారు.