1999 చంద్రబాబు రెండో సారీ అధికారంలోకి వచ్చిన వేల మాచర్లలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ తనయుడిగా రక్త చరిత్ర రాయటం మొదలు పెట్టిన బ్రహ్మా రెడ్డి నాటి నుండి నేటి వరకూ సాగించిన మారణకాండ చూస్తే పసిపిల్లలు పాలు త్రాగటానికి కూడా భయపడతారు ఆనటంలో అతిశయోక్తి లేదు.
2001 మార్చ్ 10 న దుర్గి వద్ద జరిగిన మారణకాండ గురించి తలుచుకొంటే ఇప్పటికీ వళ్ళు జలదరిస్తుంది మాచర్ల ప్రాంత ప్రజలకి. ఏడుగురు కాంగ్రెస్ కార్యకర్తలను కాపుకాచి కిరాతకంగా వేటాడి దారుణంగా నరికి చంపిన ఘటనలో కీలక పాత్రదారి నేటి మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి . దేశం యావత్తు దిగ్భ్రమకి గురయ్యిన ఈ హత్యాకాండలో మృతి చెందిన వారు జూలకంటి బ్రహ్మా రెడ్డి బాబాయిలు, తమ్ముళ్ళు కూడా ఉండటం చూస్తే స్వలాభం కోసం తన మన అనేది చూడకుండా ఎవరినైనా తుదముట్టించే బ్రహ్మా రెడ్డి నైజం అర్ధమవుతుంది .
జూలకంటి నరమేధం ఇంతటితో ఆగలేదు. 99 లో అతని తల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుండి అతను టీడీపీ ఇంచార్జ్ గా తప్పుకొనే వరకూ సాగించిన హత్యలు చూస్తే
వెల్దుర్తి గ్రామంలో ఏడు హత్యల ఘటనతో కలుపుకొని మొత్తం 09 మంది హత్య కావించబడగా,
గుండ్లపాడులో 04, పట్లవీడులో 04, రచ్చమల్లపాడులో 02,
గంగలకుంటలో 02, మరసపెంటలో 02, గొట్టిపాళ్ళలో 01,
నరమాలపాడులో 01,
జంగ్గమహేశ్వపాడులో 01, ఇలా మొత్తంగా జరిగిన 26 హత్యలులో జూలకంటి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందని పల్నాడు మొత్తానికి తెలిసిన నగ్న సత్యం .
ఇహ హత్యా యత్నాలు చూస్తే, మంచికల్లు నాగిరెడ్డి.
చినగార్లపాడు కోటిరెడ్డి. జంగ్గమహేశ్వపాడు
మన్నేయ్య, యాగయ్య. అనే నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అతిదారుణంగా కొట్టి పారేశారు. గృహ దహనాలు, లూటీలు, ఆస్తుల విధ్వంసం, దాడులు సర్వ సాధారణం అయ్యిన నాటి ఆరాచక కాలాన్ని గుర్తు తెచ్చుకొన్నా వణికిపోతారు. అప్పటి ప్రజలు .
ఇంత కిరాతకుడైన జూలకంటిని 2001 ఏడు హత్యల ఘటన తరువాత ప్రజాగ్రహానికి దడిచిన బాబు టీడీపీ నుండి కొన్నాళ్ళు సస్పెండ్ చేసి, మళ్ళీ ఎన్నికల్లో ఆరాచకం సృష్టించి అయినా గెలవాలని సస్పెన్షన్ ఎత్తేసి 2004 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఈ ఎన్నికలకు ముందు అతని ఆరాచకాలకు, హత్యా రాజకీయాలకు విసుగు చెందిన అప్పటి గుంటూరు ఎస్పీ అధికార పార్టీ నేత అని కూడా చూడకుండా అదుపులోకి తీసుకొని మూడు రోజుల పాటు భయంకరమైన పోలీస్ కౌన్సిలింగ్ ఇవ్వగా చివరికి బాబు జోక్యంతో విడిచిపెట్టారని అప్పటి వార్త .
ఎమ్మెల్యేగా ఉన్న తల్లి దుర్గాంబని ఉత్సవ విగ్రహం చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఆమె గన్ మెన్లతో గుంటూరులో జూలకంటి చేసిన సెటిల్మెంట్స్ తో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు గజగజ వణికేట్లు చేశాడు జూలకంటి.
తన ఆరాచకాలతో విసిగిన జనం రెండు సార్లు ఓడించగా మూడోసారి బాబు మొండిచేయి చూపడంతో రాజకీయంగా కనుమరుగు అయ్యాడు జూలకంటి . అయితే మాచర్ల నియోజకవర్గంలో గత అయిదు ఎన్నికల్లో ఎదురు లేకుండా గెలుస్తున్న పిన్నెల్లి సోదరులను రాజకీయంగా ఎదుర్కొలేక ఆ నియోజకవర్గంలో ఆరాచకం సృష్టించి అయినా గెలవాలన్న పట్టుదలతో అజ్ఞాతంలో ఉన్న బ్రహ్మారెడ్డిని మళ్ళీ మాచర్ల రాజకీయాల్లోకి తెచ్చి పల్నాట మరోసారి ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చాడు చంద్రబాబు.