ఎన్నికల వేళ అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇతర పార్టీల నుండి ఇప్పటికే పలువురు నేతలు వైసీపీగూటికి చేరగా మరికొందరు చేరేందుకు తహతహలాడుతున్నారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో ఆయన సమక్షంలో వివిధ పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా నారాయణపురం స్టే పాయింట్ వద్ద పలువురు టీడీపీ, జనసేన నేతలు వైసీపీలో జాయిన్ అయ్యారు.
నారాయణపురం స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్ తో పాటు పలువురు టీడీపీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్సార్సీపీలోకి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు.
నారాయణపురం స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీ వీ రావు, జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవసంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణలు వైసీపీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి ముఖ్యమంత్రి జగన్ వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఇతర నేతలు పాల్గొన్నారు.
నారాయణపురం స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు, పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి పి అనిల్ కుమార్‌యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.