ఎన్నికల ప్రచారంలో నాయకులు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలి. ఇలాంటి సమయంలో కొంత మంది నాయకులు అత్యుత్యానికి పోయి తమ నోటి దూల మాటలతో కొన్ని వర్గాలను కించ పరిచేలా మాట్లాడుతూ తనకు అలాగే తను ప్రాతినిధ్యం వహించే పార్టీకి తలనొప్పులు తీసుకువస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం లోని ముక్తేశ్వరం మాగపువారిపేటలో జనసేన నాయకులు, జనసేన పార్టీ అభ్యర్థి తమ గ్రామంలోకి అడుగు పెట్టవద్దు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. ఈ ఫ్లెక్సీ కట్టిన సంఘటన బయటకు రావడంతో అటూ నియోజకవర్గంలో మరియు జిల్లాలో పెద్ద ఎత్తున కలకలం రేపింది.
ఈ అయినవిల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పోలిశెట్టి రాజేష్ ముక్తేశ్వరం మాగపువారిపేట దళితులను సామాజిక పేరుతో తిట్టడంతో వారి మనస్సు నొచ్చుకున్నది. దీని మీద జనసేన పెద్దలకు ఫిర్యాధు చేసినా పట్టించుకోక పోవడంతో నిరసన కార్యక్రమం చేపట్టి అందరికి తెలిసేలా తమని తమ గ్రామస్తులను తిట్టిన జనసేన నాయకులు జనసేన అభ్యర్థి మా గ్రామంలో కి అడుగు పెట్టవద్దు అంటూ గ్రామంలో ఫ్లెక్సీ కట్టారు. దళితుల్ని తిట్టిన జనసేన నాయకుడి పై చర్యలు తీసుకొకుండా మమ్మల్ని ఇంకా కించపరిచారు మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీశారు, అసలు జిల్లాలో దళితుల కాలనీల్లో జనసేన నాయకులు ఎలా తిరుగుతారో చూస్తాము అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇప్పుడు ఇదే కోనసీమ జిల్లాలో కూటమి అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా జనసేన నాయకులకు. దీనిని ఎలా పరిష్కరించాలో తెలియక అట్టుడుగుతున్నారు. ఈ దళితుల మీద నోరు పారేసుకొన్న విషయం జిల్లా అంతటా వ్యాప్తిస్తే కూటమి అభ్యర్ధుల గెలుపు అవకాశాలు క్లిష్టమవుతాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన వేళలో, జన సేన పార్టీ నాయకులు దళితుల్ని కించ పరిచే సంఘటనలు జరగడం కూటమి కి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.