మ్యానిఫెస్టో అంటే ఇతర పార్టీల నాయకుల మాదిరి కాకుండా తాను దానిని ఒక పవిత్ర గ్రంధంగా భావిస్తానని మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పినట్టుగానే తన 5ఏళ్ళ పరిపాలన కాలంలో 2019లో ఇచ్చిన హామీలను 99% నేరవేర్చి రికార్డ్ సృష్టించారు. మ్యానిఫెస్టో అనే దానికి ఒక విశ్వసనీయత తీసుకుని వచ్చారు. ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు చేయలేని విధంగా మ్యానిఫెస్టో అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు జగన్
అయితే జగన్ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 2024 తన పార్టీ మ్యానిఫెస్టోని విడుదల చేశారు . సదరు మానిఫెస్టోలో గతంలో తాను ఏం చేసింది రాబోయే కాలంలో తాను ఏం చేయబోతున్నది వివరoగా ప్రచురించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. మరీ ముఖ్యంగా యువత భవితకు భరోసాని ఇస్తూ ఇచ్చిన హామీలు చూస్తే రాష్ట్రంలో యువతకు మెరుగైన అవకాశాలు అందుతాయని చెప్పడంలో సందేహం లేదు. వారిలో ఉండే ప్రతిభకు మరింత మెరుగులు దిద్దే విధంగా అనేక అంశాలను జగన్ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
2019 నుండి 2024 వరకు తాను ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలను ప్రస్తావిస్తూనే రాబోయే కాలంలో ఉద్యోగ , ఉపాది కల్పన ఏ విధంగా చేయబోతున్నారో స్పష్టంగా వివరించారు. జగన్ యువతకి ఇచ్చిన హామీలు చూస్తే.
రాష్ట్రంలోని 175 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూనే వాటిలో నైపుణ్య శిక్షణ పొందే యువతకు ప్రతి నెలా పెయిడ్ ఇంటర్న్ షిప్ కింద అబ్బాయిలకు – 2,500, అమ్మాయిలకు 3,000 ఇస్తామని ప్రకటించారు.
వచ్చే 5ఏళ్ళలో క్రమం తప్పకుండా గ్రూప్-1, గ్రూప్-2 మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి.. యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షల నిర్వహణ చేస్తాం అన్నారు. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో స్టార్టప్ హబ్, ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. పదో తరగతి డ్రాపవుట్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్‌లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ “ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ. విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం, స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ కొనసాగింపు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు బోధించేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్టులుగా నియమించి వారికి 12వేల స్టైపెండ్ క్రెడిట్లు ఇస్తాం అన్నారు. విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే వచ్చే 5 ఏళ్లలో అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కొనసాగిస్తాం అన్నారు. అన్ని ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే మనబడి నాడు – నేడు కొనసాగిస్తాం అన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, డిగ్రీ కాలేజీల రూపురేఖలను మారుస్థాం అన్నారు. 2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యావిధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ పెంచుకుంటూ 2035 నాటికి పదో తరగతి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్. 8వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా ట్యాబ్‌లు అందజేసీ కార్యక్రమం కొనసాగిస్తాం అన్నారు. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసులతో పెండింగ్ లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియను ఇప్పటికే కోర్టు కేసులను అధిగమించి మొదలుపెట్టాం అని దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం అన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తాం అని తెలిపారు.