మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుతోంది. ఈ సందర్భంగా మంగళవారం పెద్దిపాళెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఆయన మాటల్లోనే.. ‘మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగాS బీజేపీ, కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తోందంటే వీళ్ల కుట్రలతో, కుతంత్రాలతో, అబద్ధాలతో, మోసాలతో..
ఈ మధ్య కాలంలో వాళ్ల ఉక్రోశం ఏ స్థాయిలోకి వెళ్లిందంటే.. జగనన్న వల్ల నాకు ఇల్లు ఇచ్చింది. సంక్షేమ పథకాలు అందాయని తన సోషల్ మీడియాలో పంచుకుంటే గీతాంజలి అనే నా చెల్లిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం చూశాం. ఎంతæ దారుణంగా వేధించారో కూడా చూశాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం పోయిందంటేæ నిజంగా ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అంత మందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ అన్న తట్టుకొని నిలబడగలుగుతున్నాడంటే కారణం.. సోషల్ మీడియా సభ్యులే. కూటమి వాళ్లకి ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు. కానీ సెల్‌ఫోన్ చేతిలో ఉన్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ ఈ జగన్‌కు తోడుగా ఉన్నాడు. అందుకే నేను ఒంటరి కాదు. ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడి దయ మీద నాకు నమ్మకం ఉంది. నన్ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మీ అందరూ చేసిన, చేస్తున్న, చూపిస్తున్న అభిమానానికి, ఆప్యాయతలకు నిండు మనసుతో ఒకటే చెబుతున్నా. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. ఆర్గనైజేషన్ చాలా ఎఫెక్టివ్‌గా స్ట్రీమ్ లైన్ జరిగింది. భార్గవ్ చాలా క్రియాశీలకంగా ముందుండి అడుగులు వేస్తున్నాడు.
మీ అందరికీ కూడా ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం. మీ వెనకాల ఉండేది ఒక్క జగనే కాదు. వైఎస్సార్సీపీ మొత్తం ఉంది. ప్రతి నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో తోడుగా ఉంది. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ రేప్పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది.