విశాఖ రైల్వే జోన్ కి నిధులు విడుదల చేసిన కేంద్రం .
ఏళ్ళు గడుస్తున్నా, సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో లాభదాయకమైన డివిజన్‌గా ఉన్నా కూడా విశాఖపై రైల్వేశాఖ వారు శీతకన్ను వేస్తూనే ఉన్నారు. ఇదిగో అదిగో రైల్వేజోన్ అంటూ మనల్ని ఊరిస్తూనే ఉన్నారు. మనల్ని కాదని ఒరిస్సాకి రైల్వే డివిజన్ ఇచ్చినపుడు కూడా చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజీ మంచిది అని ఆంధ్ర ప్రజల కళ్ళకు గంతలు కట్టినట్టు విశాఖ రైల్వే డివిజన్ అయినా మనకు పెద్దగా ఉపయోగం లేదంటూ మభ్యపెట్టారు.
అంతేకాక, 2016 లో వైసీపీ నేత (ప్రస్తుత ఐటీ మంత్రి) గుడివాడ అమర్నాథ్ రైల్వే జోన్ కొరకు 4 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో బలవంతంగా అమర్నాథ్ చేస్తున్న దీక్షను భగ్నం చేయించింది కూడా.
ఇక్కడే చంద్రబాబు మార్కు స్వార్ధ చాణక్యం కూడా నడిచింది. ఒకవైపు వైసిపి నేత అమర్నాథ్ విశాఖకు రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే మరొక వైపు చంద్రబాబు తన పార్టీ ఎంపీలయిన గల్లా జయదేవ్ చౌదరి , రాయపాటి చౌదరీ ల చేత “విశాఖకు రైల్వే జోన్ వద్దు , గుంటూరు కు ఇవ్వాలి ” అంటూ ఉద్యమం చేయించాడు. వీళ్ళకే క్లారిటీ లేనపుడు మనకెందుకులే అని రైల్వే శాఖ కూడా మిన్నకుండిపోయారు.
2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరుపుతూ, పార్లమెంట్ వేదికగా పలుసార్లు కేంద్రం దృష్టికి తెస్తూ ఉండడంతో ఎట్టకేలకు మన రాష్ట్రం నుంచి విశాఖ జోన్ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్‌ను కేటాయించింది. భూమి పూజ పనుల ప్రారంభానికి పదికోట్ల నిధులు విడుదల చేసింది. ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కానున్నాయి.