జగన్ అంటే జనం… జనం అంటే జగన్ అని ఎందుకంటారో తెలుసా? ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది జనం జగన్ వేరు కాదు అని… చిన్నపాటి అనారోగ్యానికి గురైతేనే కన్న తల్లిదండ్రులను కూడా తాకలేని మనుషులు ఉన్న నేటి సమాజంలో సాటి మనిషిని ప్రేమించడానికి అక్కున చేర్చుకోవడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. ముసలి ముతక చిన్న పెద్ద లాంటి తారతమ్యాలు లేకుండా.. రోగంతో ఉన్నారా రొస్టుతో ఉన్నారా ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో అనే ఆలోచన కూడా చేయకుండా అందరూ తనవాళ్లుగా, నావాళ్లుగా గుండెలకు హత్తుకోవడం, గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం ఒక్క జగన్ కి మాత్రమే చెల్లింది.
ఉదాహరణకు కరోనా టైంలో కన్న తల్లిదండ్రులని తోబుట్టువుల్ని కట్టుకున్న భార్యని పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోలేని దుర్భర పరిస్థితుల్లో, రక్త సంబంధాలకు కూడా విలువలు లేని సమాజంలో, సాటి మనుషుల పట్ల కనీస మానవత్వం కూడా చూపలేని స్వార్థపూరిత పోకడలో ఎవరికి వారే యమునా తీరే అనే చందాన నడిచిన బ్రతుకులు ఎన్నో చూసాం.. కానీ తాను ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్నా జగన్ ఏరోజు ఎలాంటి బేషజాలకు తావు లేకుండా తన విశిష్ట వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉన్నాడు. తనలోని మానవీయ కోణాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరిస్తూనే ఉన్నాడు. తనని నమ్మిన జనానికి తను నమ్ముకున్న ప్రజానీకానికి అండగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు.
బహుశా మనుషుల్ని ప్రేమించడం వైయస్ కుటుంబానికి ఒక వ్యసనం కాబోలు… ఆ వ్యసనమే ఈరోజు ఎలాంటి బేషజాలకు చోటు ఇవ్వకుండా ఎంతటి భయంకరమైన అనారోగ్యంతో ఉన్నా, ఏమాత్రం బెరుకు లేకుండా ఎలాంటి అసమానతకు తావివ్వకుండా అవతలి వాళ్లను తన వాళ్ళగా ఆలింగనం చేసుకోవడంలో, తన ప్రేమను ఆప్యాయతను అందించడంలో, ఎంత కష్ట సమయంలోనైనా మీకు తోడుగా నేనున్నాను అనే భరోసా కల్పించడంలో ప్రతిపక్ష నేతగా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా మనుషుల్ని మనుషులుగా ప్రేమించడంలో గొప్ప మనసుకి, మానవతావాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. జనమే జగన్… జగనే జనం అనేంతలా ప్రజలతో మమేకమయ్యాడు. రాజకీయాలకు అతీతంగా అవధులు లేని ప్రేమను అందించడంలో నేటి సమాజానికి మార్గదర్శకంగా మారాడు.