1989 నుండి చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నేడు జగన్ చేసిన ప్రకటన చంద్రబాబుకి షాక్ కొట్టి ఉండొచ్చు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం నుండి ప్రాతినిద్యం వహిస్తున్నా చేయని అభివృద్ధిని గత అయిదేళ్లలో చేసి చూపించిన జగన్ కుప్పానికి మరో హామీ ఇచ్చాడు. దశాబ్దాలుగా వెనకబడిన నియోజకవర్గంగా మిగిలిపోయిన కుప్పంని అభివృద్ధి పధంలో నడిపే చర్యల్లో భాగంగా హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి ఈ రోజులు కుప్పం నియోజకవర్గం ప్రజలకు కృష్ణమ్మ పరవళ్లు చూపించారు .
అలాగే గతంలో కుప్పం అభివృద్ధికి జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చూస్తే కుప్పంకు మునిసిపాలిటీ హోదా ఇవ్వటంతో పాటు రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. షుమారు రూ.66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు నిర్వహించారు . నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి మరో రూ. 100 కోట్లు మంజూరు చేశారు. కుప్పం జలప్రదాయిని “పాలారు ప్రాజెక్టు “లో భాగంగా … 0.6 టిఎంసి సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.215 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు.
ఇహ సంక్షేమ పరంగా చూస్తే బాబు హయాంలో 2014-2019 మద్య కాలంలో ఒక్క ఇళ్ల పట్టా మంజూరు కాకపోగా జగన్ పాలనలో(2019 -2024 ఫిబ్రవరి 26 వరకు)-14,898 ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 7898 ఇల్లు మంజూరు చేసి 4,871 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. డీబిటి నాన్ డీబిటి సంక్షేమ పధకాల ద్వారా దాదాపు 1889 కోట్ల రూపాయలు పేదలకు లబ్ది చేకూర్చారు.
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేయబోతున్న బీసీ నేత భరత్ ను గెలిపించమని కోరుతూ గెలిచిన తర్వాత తన కేబినెట్ లో మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తానని కుప్పం ప్రజల హర్షద్వాణాల మద్య ప్రకటించారు సీఎం జగన్