“ఆయనేమైనా చేస్తానూ అన్నాడంటే… చేసి చూపిస్తాడు. ఆయన చేసేలోపు కావాలంటే మీరు ఆయన ఫోటోలను తగిలించుకుని తిరగొచ్చు. అది హద్దుల్లేని అభిమానం కేటగిరీలోకొస్తుంది. అదే మనకు నచ్చని నాయకుడు నిజంగా మంచి చేసినా, ఆ మంచి గురించి ఎవరయినా చెప్పినా… వాళ్ళని సవాలక్ష మాటలతో కుళ్ళబొడిచి మరణం వరకూ లాక్కెళ్ళాలి” ఇదీ తెదేపా అనుచరులు, అనుచరగణం తో నిండిపోయిన మీడియా సంస్థలు పాటించే సూత్రం.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు… లక్షన్నర రుణమాఫీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే రైతులు కృతజ్ఞతాభావంతో వారి పంటపొలాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతో ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. నాగలికి చంద్రబాబు ఫోటో పెట్టి రైతు పొలం దున్నుకున్నాడు. దానిని ధూమ్‌ధామ్ అంటూ ఆకాశానికెత్తేసింది పచ్చ మీడియా. ఆ తర్వాత రుణమాఫీ ఎంత మాత్రం అయిందో అందరికీ తెలుసు, ఆ లక్షన్నర కూడా అమలు చేయలేదు ఏంటి అని ప్రశ్నిస్తే రైతులకు అత్యాశ పనికిరాదు అన్న ఘనుడు బాబు . దాని గురించి పచ్చ మీడియాకి తెలిసినా రాయదు.
కానీ ప్రభుత్వ పథకం ద్వారా తన పేరు మీద ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన ఆనందంలో లబ్ధిదారులు మాత్రం కెమెరాల ముందు, మైకుల ముందు మాట్లాడకూడదు, వారి మాటల్ని అధికార పార్టీ ప్రచారం చేయకూడదు. చేసేరంటే… ఇంక అంతే… వారికి శల్య పరీక్షలు పెట్టి, మానసికంగా సుష్కించిపోయేలా… విమర్శలు చేసి, మాటలనే బళ్ళేలతో పొడిచి, విమర్శలనే కత్తులు దూసి, ట్రోలింగ్ పేరుతో నరకాన్ని కళ్ళముందే చూపించి వదులుతారు ఈ తెలుగు తమ్ముళ్ళు.
ఇప్పటికీ మనవల్ల ఒక మహిళ చనిపోయింది, కుటుంబం ఇబ్బందిలో ఉంది, పిల్లల బ్రతుకు ప్రశ్నార్ధకమైపోయిందీ అనేవి వేటినీ పట్టించుకోకుండా… ఆ చావు చుట్టూ ఇంకా రాజకీయాలు చేయడానికి అభినవ శకునిలై కాసుక్కుర్చున్నారు. వీళ్ళు కాక ఇంకెవరు అధికారం లో ఉన్నా తట్టుకోలేని ఆక్రోశం నుంచి వచ్చిందే… ఈ రాక్షసత్వం. ఇది పోదు. నిజంగా వాళ్ళింట్లో ఆడపిల్ల ఇలాంటి వివక్ష ఎదుర్కొని చనిపోయినా కూడా రాదు. వచ్చిందల్లా ఫోర్ట్వంటీ బాబుని ఆకాశానికెత్తి జబ్బలు చరచుకోవడమే!!!