ఎన్టీఆర్ కుటుంబాన్ని నిలువునా చీల్చి ఎన్టీఆర్ నే నీ దాదాగిరి, రౌడీయిజం చెల్లవని ఆయన కొడుకుల సమక్షంలోనే బెదిరించిన వ్యక్తికి ఈ రోజు రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లో చీలికల కోసం కుట్రలు చేయకుండా ఉంటాడా?
ఆనాడు వెన్నుపోటు వలన పదవి పోగొట్టుకున్న ఎన్ టీ ఆర్ తనకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అనేక విధాలుగా ప్రయత్నించాడు. ప్రెస్ మీట్లు పెట్టాడు, జనంలోకి వెళ్ళాడు,న్యాయపరంగా ప్రొసీడ్ అవ్వాలని ప్రయత్నించాడు. ఎన్ని చేసినా, అధికారం లేక పోవడం, వయసు సహకరించక పోవడం, తన వెంట ఆఖరుకి కొడుకులు కూడా తోడు లేక పోవడంతో ఆయన చంద్రబాబు పై గెలిచి నిలవలేక పోయాడు. నాదెండ్ల చేసిన మోసాన్ని తట్టుకుని నిలబడి, తిరిగి పదవిలోకి రాగలిగాడు గానీ, సొంత అల్లుడు కొట్టిన దెబ్బని ఆయన తట్టుకోలేక పోయాడు. ఎన్ టీ ఆర్ ని నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఈ నాటికీ అభిమానించే వారు ఆనాడు చంద్ర బాబు చేసిన కుట్రపూరితమైన పనులన్నీ మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటే మంచిది.
1995 ఆగస్టు 31 న సభలో ప్రభుత్వ బల పరీక్ష జరగనున్న సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఓటు వేసి గెలిపించిన మీ ఎమ్మెల్యేలని న్యాయం వైపు నిలబడమని అడగండని ఎన్ టీ ఆర్ ప్రజలకు పిలుపునివ్వడంతో చంద్రబాబుకి హడలు పుట్టింది. అప్పటికే బాబు, ఎన్ టీ ఆర్ కి వ్యతిరేకంగా ఓటు చేయాలని తన చీలిక వర్గం ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేశాడు. అయినా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఎన్ టీ ఆర్ పిలుపుకు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని ఆయనకు ఓటేస్తారో అనే శంక మనసులో ఉంది. 185 మంది శాసన సభ్యుల మద్దతు ఉన్న తననే టిడీఎల్ పీ నాయకుడిగా గుర్తించాలని విలేకర్ల ముందు చెప్పాడు.
పైగా ఎన్ టీ ఆర్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎన్ టీ ఆర్ కూడా ఓటు వేయాలని, లేక పోతే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన మీద చర్యలు తీసుకోవచ్చని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్ జరిగిన రోజు ఎన్ టీ ఆర్ పుత్రుడు హరి కృష్ణ, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా బాబు పక్కనే ఉన్నారు. 70 ఏళ్ళు పై బడ్డ తన తండ్రి దాదా గిరి చేస్తున్నాడా లేక అన్యాయంగా లాక్కోబడిన తన హక్కు గురించి పోరాడుతున్నాడా అనేది హరికృష్ణ గ్రహించలేక పోవడం విషాదం.
ఎన్ టీ ఆర్ ఇలా పిలుపు ఇవ్వడాన్ని ఊహించని బాబు, వెంటనే ఆ పిలుపు ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడు. ప్రజలు నిజంగానే ఎన్ టీ ఆర్ కోరిక మేర బయటికి వస్తారేమో అన్న భయంతో “ప్రజా స్వామ్యంలో ప్రతిదీ ప్రజా ప్రతినిధుల ద్వారానే జరగాలి తప్ప ప్రతి దానికీ ప్రజలు రావాలంటే ఎలా?” అని ఒక చొప్పదంటు ప్రశ్న వేసి తన భయాన్ని చాటుకున్నాడు.
స్వయంగా తను గుండా గిరీ చేసి పార్టీ పగ్గాలను, ముఖ్య మంత్రి పదవిని మామ ఎన్ టీ ఆర్ నుంచి దౌర్జన్యంగా లాక్కున్న వేళ ఇదన్యాయమని అక్రోసించిన మామతో నీ “దాదా గిరి నడవదు” అని ఎన్ టీ ఆర్ కే వార్నింగ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు.
ఇలా చంద్రబాబు చేసిన దుర్మార్గాలు, అకృత్యాలు ఎన్నో ఎన్నెన్నో, పదవీ కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన బాబు, ఆ పదవి కోసం ప్రత్యర్థుల కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, ఇష్టానుసారం మాట్లాడటం అతనికి మంచి నీళ్లు త్రాగినంత సులువు.