చారెడు నేల బతుకు బాట అంటూ నువ్వు చేసిన మోసం రైతులు ఇంకా మరువలేదే.
పులులకంటే “మేకవన్నె పులులు” మరీ ప్రమాదం. ఇప్పుడు పవన్ కళ్యాన్ తీరు చూస్తుంటే పైన చెప్పిన సామెత నిజమనిపిస్తుంది. “చంద్రబాబు, రైతువ్యతిరేకి” ఈ రెండూ పర్యాయపదాలని రాష్ట్రంలోని రైతాంగం ఎప్పుడో ఒక నిర్ధారణకు వచ్చాయి. చంద్రబాబు 14ఏళ్ళ పాలనలో ఆయన అవలంభించిన రైతు వ్యతిరేక విధానాలు ఇప్పటికి రాష్ట్రంలోని రైతాంగం ఎవ్వరూ మర్చిపోయి ఉండరు.
బహుశా ఇందుకే కాబోలు చంద్రబాబు తాను రైతుల సంక్షేమంపై ఏది మాట్లాడినా గత అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలోని రైతాంగం ఎవ్వరు నమ్మరనే నిజాన్ని గ్రహించి తోడుగా పవన్ కళ్యాణ్ ని వెంట పెటుకుని తిరుగుతూ, ఆయన చేత రైతుల సంక్షేమంపై మాట్లాడిస్తున్నారు. కానీ చంద్రబాబు గొర్రెలని మింగే పులైతే ఆయన పంచన చేరిన పవన్ మేక తోలు కప్పుకు వచ్చి గొర్రెలని మింగేసే మేకవన్నె పులని ఇప్పుడు రాష్ట్రంలోని రైతాంగం నుండి వినిపిస్తున్న మాట.
రాష్ట్ర విభజన తరువాత పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రైతులకి ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చిన పాపాన పోలేదు. సంపూర్ణ రుణ మాఫీ అంటూ మొదలుపెట్టిన మోసం రెయిన్గన్లు, పంట కుంటలు, రైతు రథాల్లో చేతివాటం వరకు నిర్విరామంగా సాగింది. వ్యవసాయం టైం వేస్ట్ , కరువుకు తుఫానే మందు, వద్దన్నా వ్యవసాయం చేస్తున్నారు, ఒకసారి పంట ఎండిపోతే బుద్ది వస్తుంది, పంటలు ఎండిపోతే ఇక కరెంటు ఎందుకు ?, ప్రాజెక్టులు కడితే లాభంలేదు, ఎకారకు అయ్య ఖర్చు ఎక్కువ, పన్నుల రూపంలో వచ్చేది తక్కువ. ఇవన్ని రైతు వ్యతిరేక మనస్తత్వం ఉన్న చంద్రబాబు 14ఏళ్ళ పాలనలో రైతులపై పేల్చిన డైలాగులే.
1995లో అధికారంలోకి రాగానే మొదటి తూటా రైతులపై పేల్చి గోదావరి జిల్లా వెలివెన్ను గ్రామంలో ఇద్దరు రైతులని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుతో జతకట్టి, తమ కూటమి అధికారంలోకి వస్తే రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం అని పవన్ కళ్యాణ్ చెప్పడం అంటే, అంతా తెలిసి కూడా మేకవన్నే పులిలా మాట్లాడం కాక మరేమిటని రైతుల నుండి ఎదురవుతున్న ప్రశ్న. చంద్రబాబు కన్నా చంద్రబాబుని నమ్మమని చెబుతున్న పవన్ కళ్యాణ్ మరింత ప్రమాధమైన మనిషని రాష్ట్ర రైతాంగం నుండి వినిపిస్తున్న మాట .
కొసమెరుపు ఏంటంటే 2021 లో లాక్ డౌన్ లో ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన యువతకు 250 గజాల్లో 81 రకాల పంటలతో కుటుంబం మొత్తానికి సరిపోయే ఆదాయం సంపాదించటం నేర్పు్తానని చెప్పి తర్వాత ఆ ఊసే ఎత్తని పవన్ కళ్యాణ్ ఈ రోజు తాను, చంద్రబాబు కలిసి రైతుల్ని ఉద్దారిస్తానని కబుర్లు చెప్పడం.