‘నిజాయతీకి ప్యాంట్, షర్ట్ వేస్తే అది నేనే. నాఅంత మంచి మనిషి ఉండడు. నా అంత నీతిమంతుడిని మీరు చూసి ఉండరు’ సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పే ఈ మాటలు విని తెలుగు తమ్ముళ్లే నవ్వుతుంటారు. ఎందుకంటే బూతద్దం పెట్టి వెతికినా బాబులో నిజాయతీ అనేది అణువంత కూడా కనిపించదు. ఏప్రిల్ 30వ తేదీని హానెస్ట్ డేగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా నారా వారి నిజాయతీని ఎంత చర్చించినా తక్కువే అవుతుంది.
బాబు దృష్టిలో ఎన్టీఆర్ వద్ద చాలా నిజాయతీగా ఉన్నాడు. వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం యత్నించలేదు. ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో అలా జరిగిపోయిందంతే. సీఎం అయ్యాక ఆయన ఆస్తి లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. అయినా నేను నిజాయతీపరుడిని అని చెప్పుకోవడం ఆయనకే సాధ్యం. ఎవరో చేసిన అభివృద్ధిని, తెచ్చిన పరిశ్రమలను తన ఖాతాలో వేసుకోవడం ఆయన దృష్టిలో నిజాయతీ కిందకే వస్తుంది.
ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబును అత్యంత నిజాయతీ గల వ్యక్తిగా ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. వాస్తవం ఏంటంటే ఇదే వ్యక్తి 2014లో 650కి పైగా హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అమరావతిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. సీఎంగా ఉన్నప్పుడు అనుయాయులకు దోచిపెట్టాడు. జన్మభూమి కమిటీల ద్వారా పేదల జీవితాలతో ఆడుకున్నాడు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అడ్డగోలుగా హామీలిస్తున్నాడు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొడుతున్నాడు.
చంద్రబాబు నిజాయతీపరుడే అయితే ఆయన 14 సంవత్సరాల పాలనలను ప్రజలు మెచ్చుకుంటారు. కానీ ఇప్పటికి కూడా నమ్మకం కుదరడం లేదంటే ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. బాబు దృష్టిలో నిజాయతీ అంటే ఏంటంటే.. ప్రజలను మోసం చేయడం.. నోటికి అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలు చెప్పడం.. మభ్యపెట్టడం.. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం.. అవినీతి చేయడం.. అనైతికంగా పొత్తులు పెట్టుకోవడం.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈయనలా ఎవరూ ఉండకూదని ఒక డే పెడితే ఎంత బాగుంటుందో. దానికి మోసగాడి దినమని పెట్టి.. మనుషుల్లో ఇంతటి దారుణమైన వ్యక్తి ఉండడని చర్చ పెడితే కరెక్ట్‌గా ఉంటుందేమో..