సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజున అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి చేసుకున్న సీఎం వైయస్ జగన్కు అనంతపురం ప్రజలు చిరస్మరణీయమైన స్వాగతాన్ని అందించారు.
పత్తికొండ శివార్లలోని స్టే పాయింట్ నుంచి ఇవాళ ఉదయం మొదలైన ముఖ్యమంత్రి బస్సుయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దీంతో షెడ్యూల్ కన్నా ఆలస్యంగా బస్సు యాత్ర నడిచింది. మధ్యాహ్న భోజన విరామ సమయం లేకుండానే బస్సుయాత్ర కొనసాగింది.
గుత్తిలో సామాన్యుడి జన కవాతు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోకి సీఎం జగన్ అడుగుపెట్టగానే చరిత్రలో నిల్చిపోయేలా అశేష అభిమానగణం స్వాగతాన్ని అందించింది. గుత్తి రైల్వే బ్రిడ్జి నుంచి గుత్తి హైవే వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర దాదాపు రెండు గంటలపాటు బస్సు యాత్ర కొనసాగింది.
తమ అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రభంజనంలా తరలి వచ్చారు. గుత్తి చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్ర సాగింది.
మరోవైపు కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా బారులు తీరిన జనంతో గుత్తి పట్టణం నిండిపోయింది.
బస్సుయాత్రలో గుత్తి పట్టణంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుతో పాటు సమాంతరంగా ప్రధాన రహదారిలో జనం కదులుతూ వచ్చారు.
సీఎం జగన్ చేపడుతున్న బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో కలవరం మొదలైందనే చెప్పొచ్చు.. మరోవైపు చంద్రబాబు సభలకు ప్రజాదరణ ఉండటం లేదు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే సీట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏదేమైనా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సూపర్ సక్సెస్ కావడం ఇప్పుడు కూటమి అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పొచ్చు.