జగన్ ఎన్నికల ప్రచారల సరళి చూస్తే గతంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మద్దతు వైసీపీకి ప్రజల్లో ఉనట్టు స్పష్టమౌతుంది. మేమంతా సిద్దం అంటూ జగన్ చేస్తున్న ప్రచార యాత్రకి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లబిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జగన్ వెంట ప్రజలు ప్రభంజనంలా కదలి రావడం చూస్తున్న రాజకీయ పండితులు సైతం తమ సర్వీసులో ఈ స్థాయిలో జన ప్రవాహాన్ని వీధుల్లోకి రప్పించిన నాయకుడు మరొకరు లేరని తమ రాజకీయ అనుభవాన్ని నేరువేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న నేపథ్యంలో హాట్ సీట్ గా మారిన మంగళగిరిలో ఈరోజు జరిగిన మేమంతా సిద్దం సభలో జగన్ వెంట జనం ఉప్పెనలా కదిలారనే చెప్పాలి.
మంగళగిరి వీధుల్లోకి జగన్ వెంట జనం కదిలి రావడం చూస్తున్న స్థానికులు మళ్ళీ లోకేష్ ఓటమి తప్పదనే సంకేతాలు బలంగానే ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక విధానం అంటూ లేని లోకేష్ కి చంద్రబాబు బీసీల సీట్ అయిన మంగళగిరిని ఇవ్వడం బీసీలను అణగదొక్కడంలో ఒక భాగమేనని అందుకే మంగళగిరిలో లోకేష్ ఎంత డబ్బు వెదజల్లినా బీసీ మహిళ లావణ్య గారి చేతులో లోకేష్ ఓటమి ఖాయమైందని స్పష్టం చేస్తున్నారు. రెండో ఓటమి లోకేష్ ని మరింత భయపెడుతుందని కావున గెలిచి తీరాలనే తొందరలో ఎన్ని అడ్డదారులు తొక్కినా గెలిచేది బీసీ మహిళ లావణ్య గారేనని స్థానికులు చెబుతున్న మాట .. ఏది ఎలా ఉన్నా మంగళగిరిలో నేడు వచ్చిన జన ప్రవాహం చూస్తే మళ్ళీ లోకేష్ కి పరాభవం తప్పేలా లేదు.