ప్రజలతో మమేకమయ్యే సందర్భాల్లో తమ ఇబ్బందులు గురించి చెప్పుకునే ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ప్రజల సమస్యలను తీర్చే సీఎం జగన్ మనసున్న మరాజుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల ఇబ్బందులను 24 గంటల్లోగా పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న సీఎం జగన్ కొన్ని సందర్భాల్లో స్పందించిన తీరు ఆదర్శనీయం అని చెప్పవచ్చు.
20 కోట్ల విలువైన ఇంజక్షన్ తో చిన్నారి ప్రాణాలు నిలిపి..
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన ధరణి, అశోక్ కుమార్ రెడ్డి దంపతుల 14 నెలల కుమార్తె ప్రజ్ఞ రెడ్డికి అత్యంత అరుదైన వ్యాధి వచ్చింది. వెన్నెముక కండరాలు క్షీణతతో బాధపడుతున్న ప్రజ్ఞ రెడ్డి బ్రతకాలంటే సుమారు 16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయించాల్సి ఉంటుంది. అమెరికా నుండి ఇక్కడకు వచ్చేసరికి అన్ని పన్నులతో కలిపి 20 కోట్ల రూపాయల ఖర్చయ్యే ఆ ఇంజక్షన్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. కాగా ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంలో తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ అమెరికాలోని కంపెనీలతో మాట్లాడి చిన్నారికి అవసరమైన ఇంజక్షన్ ను రప్పించి ఆ చిన్నారికి చికిత్స ఇప్పించారు. దీంతో తమ కుమార్తె ప్రాణాలను కాపాడిన సీఎం జగన్ కు రుణపడి ఉంటామని, సీఎం జగన్ వెంటనే స్పందించకపోయి ఉంటే.. మా బిడ్డ ప్రాణాలతో మిగిలేది కాదని నా బిడ్డ ప్రాణాలు నిలిపిన జగనన్నకు చేతులెత్తి మొక్కుతున్నామని ధరణి, అశోక్ కుమార్ రెడ్డి దంపతులు వెల్లడించారు.
సీఎం కాన్వాయ్ అంబులెన్స్ లో క్షతగాత్రులను తరలించి..
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా పశ్చిమగోదారి జిల్లా కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. సీఎం కాన్వాయ్ మరో పావుగంటలో వెళ్లబోతుందనగా ఒక పోలీస్ వాహనాన్ని బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసు సిబ్బంది బస్సులో సీఎం పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి తెలియజేశారు.
పూళ్ల నుంచి కాన్వాయ్ బయల్దేరి ఘటనా స్థలానికి చేరుకోగానే సీఎం బస్సును ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని తనతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు లోక్ సభ అభ్యర్థి కారుమూరు సునీల్‌కుమార్ యాదవ్ ను అక్కడే దించి వైద్యానికి తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భద్రతా నియమాలను ఉల్లంఘించి, సీఎం కాన్వాయ్ లో ఉంచిన అంబులెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. సత్వర వైద్య సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రిలోని వైద్యలను, సిబ్బందిని అప్రమత్తంచేశారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్ స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి అండగా నిలిచి..
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని దువ్వ వెంకయ్య కాలువ గట్టు వద్ద నివసిస్తున్న ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా కోనాల ఆంజనేయులు, కామాక్షి దంపతులు తమ కుమార్తె దానేశ్వరిని తీసుకువచ్చి సీఎం జగన్‌ను కలిశారు. తమ కుమార్తె కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోందంటూ కోనాల ఆంజనేయులు, కామాక్షి దంపతులు కన్నీరుపెట్టుకున్నారు. దీంతో తక్షణమే స్పందించిన సీఎం జగన్ పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను ప్రభుత్వం భరిస్తుందంటూ భరోసా ఇచ్చారు. దీంతో ఆంజనేయులు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. దేవుడిలా వచ్చి ఆదుకుంటున్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు..
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇలా ప్రతీ సందర్భంలో బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూ మనసున్న మరాజునని సీఎం జగన్ చాటుకుంటున్నారు. ప్రజల సమస్యల పట్ల జగన్ స్పందిస్తున్న తీరును చూసి తిరిగి సీఎంగా ఆయనే రావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారు.