సమాజంలో నీతి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులు పోరాట పటిమ చూపడంలో గాంధీ, పట్టుదలలో పొట్టి శ్రీరాములు గారికి ఏమాత్రం తీసిపోరు. అటువంటి సేవాతత్పరులను చంద్రబాబు అత్యంత దారుణంగా అవమానకరంగా మాట్లాడితే కనీసం తప్పు అని స్పందించలేని పవన్ కళ్యాణ్ నేడు ఆ సమాజానికి అండగా ఉంటానని సన్నాయి నొక్కులు నొక్కదం చూస్తే ఓట్ల కోసం వెంపర్లాడటం తప్ప వారిపై పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ది లేదనేది స్పష్టం అవుతుంది.
రావులపాలెం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని ఆరోపణలు చేయడమే కాకుండా వెకిలిగా నవ్వుతూ వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసారు. కనీసం ఈ విషయం పై స్పందించలేని పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఆర్యవైశ్యుల ఓట్లు కావాల్సి వచ్చాయా అని ఆ సామాజిక వర్గం నుండి ఎదురవుతున్న ప్రశ్న. అలాగే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేయాలని ఆర్యవైశ్యులు కోరినా పట్టించుకోని చంద్రబాబుకి తాము ఎలా ఓటు వేస్తామని. తమ కోరికకు గౌరవం ఇచ్చి దివంగత నేత వైయస్సార్ గారే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేశారని. ఇప్పుడు జగన్ గారు సైతం అనేక సంక్షేమ పధకాల ద్వారా తమకి తోడుగా ఉన్నారని. వీరికే తమ మద్దతు ఉంటుంది తప్ప రాజకీయ అవసరాలకి వచ్చే పవన్ కళ్యాణ్ లాంటి వారికి కాదని ఆవర్గం స్పష్టం చేస్తుంది.