హోలీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్ ఖాతాలోనూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కాగా మరో కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సామాజిక సాధికారికత ప్రాతిపదికన పలువురు అణగారిన వర్గాలకు మెజారిటీ సీట్లను కేటాయించిన సీఎం జగన్ సిద్ధం సభలతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పారు. త్వరలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టబోతున్న సీఎం జగన్ ప్రజలతో మమేకం కానున్నారు.
సీఎం జగన్ ను ఒంటరిగా ఢీ కొట్టే ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా జగన్ పై పోటీకి దిగడం విశేషం. తన సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని నమ్ముతున్న జగన్ ఉగాది రోజున తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాలకు మించి తాజాగా ప్రకటించబోయే మేనిఫెస్టో ఉందని సమాచారం.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
అందరికీ హోలీ శుభాకాంక్షలు.