గల్లా జయదేవ్.. గుంటూరు ఎంపీ, అమరరాజా కంపెనీ అధినేత. చంద్రబాబు తన రాజకీయాల కోసం ఆ ఫ్యాక్టరీలను వాడుకోవడంతో మనస్తాపానికి గురైన గల్లా ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
జయదేవ్ తల్లి అరుణ ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆమె, కొడుకు తెలుగుదేశం పార్టీలో చేరారు. గల్లా 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలుపొందారు. తాజాగా ఆయన రాజకీయాలకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుని తన పార్లమెంట్ పరిధిలో నాలుగు వేలమంది అభిమానగణానికి 28వ తేదీన విందు ఇస్తున్నారు. అయితే గల్లా ఈ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబే.
అమరరాజా ఫ్యాక్టరీలో కాలుష్యంపై పర్యావరణ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి, జగన్‌పై విషం కక్కడానికి టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించింది. తమ మాట వినలేదని గల్లాను వేధిస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం కక్ష సాధించడంలేదని, కాలుష్యం వ్యవహారంపై కోర్టులో కేసు ఉందని, దీనిని ఎదుర్కొంటున్నామని సాక్షాత్తు జయదేవ్ చెప్పినా బాబు అండ్ కో వినలేదు. అమరరాజా కంపెనీని తమ రాజకీయాల కోసం రోడ్డుకు లాగుతూ వచ్చారు. ఇదిలా ఉండగా తమ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ప్లాంట్‌ను పెట్టాలని గల్లా నిర్ణయించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడే తెలుగుదేశం, ఎల్లో మీడియా రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే అమరరాజా తరలిపోతోందంటూ పదేపదే అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా అడ్డూఅదుపు లేకుండా నిజాలు దాచి ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెట్టింది. దీనిపై ఆయా వర్గాలు స్పష్టలు ఇచ్చినా వదల్లేదు. సాధారణంగా ఏ వ్యాపారవేత్త అయినా తన బిజినెస్‌ను విస్తరించాలని కోరుకుంటాడు. అందులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో తన కార్యకలాపాలకు శ్రీకారం చుడుతుంటాడు. గల్లా విషయంలోనూ అదే జరిగింది. అయితే ఆయన కంపెనీ వెళ్లిపోయిందంటూ ప్రజల్నితప్పుదోవ పట్టించేందుకు పచ్చ మాఫియా తీవ్రంగా ప్రయత్నించింది.
బాబు ధోరణి నచ్చక..
జయదేవ్ ఫక్తు వ్యాపారవేత్త. ఆయన దాని గురించే ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు సీఎం పదవి కోసం తన పరిశ్రమను వాడుకుంటున్నాడని గల్లాకు అర్థమైంది. దీంతో ఆయన బాధపడి తన రాజకీయాలకు, వ్యాపారానికి పొసగదని తెలుసుకున్నారు. దీంతో ఏకంగా పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతున్నారు. బాబు వాడకం ఆ స్థాయిలో ఉంటుంది. జయదేవ్ ఫ్యాక్టరీలను తన స్వార్థం కోసం వాడుకుని ఇప్పుడు ఆయన్ను కరివేపాకులా తీసిపారేశాడు.