జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తరచుగా చెప్పే మాట ఒకటే. మన ప్రభుత్వం నిర్మిస్తుంది ఇళ్లు కాదు ఊర్లు అనే మాట నిజం చేస్తూ దాదాపు గా ఇప్పటిదాకా ఇంటి స్థలాలు లేని 31.19 లక్షల పేద వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయించి ఆ స్థలాలను వారి పేరు పైన రిజిస్ట్రార్ చేయించే బహుత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ నేల 27వ తేది నుంచి గ్రామ సచివాలయంలో ఆ స్థలం కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రభుత్వం జివో ను విడుదల చేసింది.
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి 17 వేలకు పైగా జగన్ అన్న కాలనీలను నిర్మించింది. మనకు ఓటు వేసారా లేదా , మన పార్టీనా కాదా అని చూడకుండా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాతో పాటు ఇంటిని నిర్మించుకోలేని ప్రతి పేద వాడికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశించి ఇప్పటికే రికార్డ్ స్థాయిలో నిర్మించింది.
పేదలకు అందించిన ఇళ్ళ పట్టాలకి ఈ నెల 27 నుంచి రిజిస్ట్రేషన్లు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశించారు. సచివాలయాలలోనే ఈ ప్రక్రియ విఆర్వో లు చేసేవిధంగా ఈ రెండు రోజులలో ఆర్డినెన్సు జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ లోపు జిల్లా కేంద్రాలలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని కమిషనర్ ఒక ప్రకటన లో తెలిపారు. బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు, సర్వే , ప్లాట్ నెంబర్లు, పేర్లు , ఇతర వివరాల నమోదు లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలి అని తెలిపారు.
గతంలో ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా స్థలం పైన పేద వాడికి పూర్తి హక్కు దక్కేది కాదు. డి – పట్టాలు కావడం తో అనుభవించడం మినహా వాటి పైన సర్వ హక్కులు వుండేవి కాదు. దానితో ఉండటానికి మినహా వేరే అవకాశం కోసం వినయోగించుకోవడం ఉండేది కాదు. కానీ జగన్ ప్రభుత్వం ఇళ్లు పట్టాలు పొందిన లబ్ధిదారులకు పది ఏళ్లు తర్వాత సర్వ హక్కులు ఉండేలా అసైన్డ్ భూములు చట్టాన్ని సవరించింది. పది సంవత్సరాల తర్వాత ఇంటి పైన ఋణాలు, ఆటోమేటిక్ గా సేల్ డీడ్ లాగా మారుతాయి, అనగా ఆ స్థలాలును హక్కుదారుడు కావాలి అంటే అమ్ముకోవచ్చు, ఇతర ప్రయోజనాలు కోసం వినియోగించుకోవచ్చు.
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఈ స్థలాలును పేదలకు పంపిణీ చేయకూడదు టీడీపీ పార్టీ చంద్రబాబు ఆధ్వర్యంలో కోర్ట్ లో ఎన్నో పిటిషన్ లు వేశారు , కానీ ఈ ప్రభుత్వం ఆ సవాళ్లును ఎదుర్కొని అన్ని అడ్డంకులు తొలిగించుకొని అని సజావుగా సాగేలా చూసుకుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటి పట్టా లేదా సొంత స్థలం లో ఇళ్లు నిర్మించదలిస్తే జన్మభూమి కమిటీ దగ్గరకు వెళ్ళి వాళ్లకు డబ్బిచ్చి, ప్రాధేయపడి తెచ్చుకునే పరిస్థితి. కానీ జగన్ ప్రభుత్వం లో అలా కాకుండా, అర్హుడు అయితే చాలు లబ్ధిదారుల ఇంటి దగ్గర కే వచ్చి అప్లికేషన్ పూర్తి చేసి పధకాన్ని వర్తింపజేయడం విశేషం