ఇంటికి దీపం ఇల్లాలే. ఆ ఇల్లాలి చేతిలో ఇంటి స్థలం, ఇల్లు ఉంటే, ఆ ఇంటికి భరోసా దక్కుతుంది.అందుకే జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ సంక్షేమ పథకాల ఫలాలు స్త్రీలకు అందాలని ఆ దిశ గా కృషి చేస్తోంది.
అందుకే ఇప్పుడు, దేశంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా 30.61 లక్షల మంది మహిళలకు ఒకే సారి ఇళ్ళ స్థలాలు ఇచ్చి, రికార్డు సృష్టించింది. 30 లక్షలకు పైగా పట్టాలు ఇవ్వడమే ఒక రికార్డ్ అయితే, వారంతా మహిళలు కావడం మరో గొప్ప విషయం.
పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కన్వేయెన్స్ డీడ్స్ ఇవ్వనుంది జగన్ ప్రభుత్వం. ఆ డీడి లు పదేళ్ల తర్వాత శాశ్వత పట్టాలుగా మారతాయి. గుండె మీద చేయి వేసుకుని భరోసాతో కంటి నిండా నిద్ర పోయే మంచి రోజు ఆ పేద మహిళలకు అతి త్వరలో రానుంది.
ఈ రిజిస్ట్రేషన్స్ కోసం ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ఇళ్ళ స్థలాల కోసం రూ. 31,832 కోట్లతో 71,811 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమితో 17 వేలకు పైగా లే అవుట్లు నిర్మించారు. వీటిలో భాగంగా 11,343 కోట్లతో 25,374 ఎకరాల ప్రైవేట్ భూమిని కూడా సేకరించారు.
ఇప్పటి వరకూ గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలను వారి పేరున రిజిస్టర్ చేయలేదు
1977 అసైండ్ భూముల చట్టం ప్రకారం గత ప్రభుత్వాలు కేవలం డీ పట్టాలు మాత్రమే ఇచ్చేవి. అవి కూడా అరకొరగానే ఉండేవి. మొదటి సారి సి ఎం జగన్ ప్రభుత్వం లక్షల సంఖ్యలో, తన అక్క చెల్లెమ్మల పేరున ఇళ్ళ స్థలాలు రిజిస్టర్ చేయనుంది
ఈ భూములను వారి పేరు మీద రిజిస్టర్ చేయడానికి వీలుగా అసైండ్ భూముల చట్టాన్ని ఇటీవల ప్రభుత్వం సవరించింది.దాని ప్రకారం 2021 లో డీ పట్టాలు పొందిన లబ్ధి దారులకు స్థలాల రిజిస్ట్రేషన్స్ చేసి కన్వేయన్స్ డీడి ఇవ్వనుంది
ఈ డీడి లు పదేళ్ళ గడువు ముగిసిన వెంటనే సేల్ డీడ్ గా మారతాయి.అంటే అప్పుడు ప్రభుత్వ ప్రమేయం లేకుండానే నేరుగా ఆ స్తలాలను అమ్ముకోడానికి, లేదా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకునే హక్కు స్థలం సొంతదారుకి వస్తుంది.