Doctors: జగన్ పాలనలో ప్రతి మండలాన్ని రెండుగా విభజించి, రెండేసి పీహెచ్‌సీలకి ఇద్దరేసి వైద్యులను నియమించి చేసిన ప్రయోగం ఇపుడు వినూత్న ఫలితాలను అందిస్తుంది. ఈ ఫామిలీ డాక్టర్ ప్రయోగం ఇపుడు
గ్రామీణుల పాలిట వరమై ఆపదలో ఆదుకునే ఆసరా అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10302 విలేజ్ క్లినిక్‌లలో ఉండే డాక్టర్లు వారంలో రెండుసార్లు గ్రామాలను సందర్శించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. అనంతరం మంచానికే పరిమితమైపోయిన రోగులను ఇళ్ళు వద్దకే వెళ్ళి పరీక్షించి, వారికి వైద్య సేవలు అందిస్తూ గ్రామీణులకి ఫ్యామిలీ డాక్టర్లా మారారు.
ఇలా చేసిన ఈ ప్రయోగం వినూత్న ఫలితాలను అందించడమే కాక గ్రామీణుల ఆరోగ్యం కాపాడే అధ్బుతమైన కార్యక్రమం అయింది. గత 15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు ఈ కార్యక్రమం ద్వారా అందించబడ్డాయి. ఇలాంటి ప్రయోగాన్ని దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.
ఇవేకాక, దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, సుగర్ వంటి వాటికి తరచూ డాక్టర్లను సంప్రదించడానికి దగ్గరలోని టౌన్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఫామిలీ డాక్టర్లే వైద్యం అందిస్తుండటంతో గ్రామీణ ప్రజలకు ఊరట లభిస్తుంది.