పరిపాలనా రాజధాని సాగర నగరం విశాఖను పర్యాటకంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైఎంసిఏ సమీపంలో మణిహారం లాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జిని 1.60 లక్షల వ్యయంతో నిర్మించి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్లు నిన్నటి రోజున ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటలు గడవక ముందే ప్రమాదవశాత్తు తెగిపోయి సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోయిందనిఈ ఘోర ప్రమాదంలో అదృష్టవశాత్తు ఆ సమయంలో సందర్శకులు బ్రిడ్జిపైన లేకపోవడంతో ప్రమాదం తప్పిందంటూ ప్రభుత్వం నిర్మించిన ఈ కట్టడం నాసిరకంగా కట్టారు కాబట్టే ఇలా జరిగిందంటూ తెలుగుదేశం , జనసేన పార్టీల అనుకూల సోషల్ మీడీయా ఖాతాల్లో అలాగే ప్రతిపక్ష అనుకూల పత్రికల్లో మరియు చానల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తెలుగుదేశం జనసేన చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా జరిగిన వాస్తవాన్ని ఈ విధంగా వివరించింది. “ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా 26.02.2024 తేది నుండి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ, వాతావరణములో మార్పుల రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటం వలన నేడు సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి అనుమతించ లేదు మరియు సముద్ర ప్రవాహాల తీవ్రత రీత్యా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వాహకులు “టీ” పాయింట్ (వ్యూ పాయింట్) ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించే నిమిత్తము, ఏంకర్ లకు దగ్గరగా జరిపి నిలిపి వుంచడం జరిగినది. ఆ విధంగా బ్రిడ్జ్ మరియు “వ్యూ పాయింట్” ల మద్య ఏర్పడిన ఖాళీ ప్రాంతాన్ని ఫోటో తీసి “ఫ్లోటింగ్ బ్రిడ్జ్” తెగిపోయిందన్న వార్త సోషల్ మీడియా లో ప్రచారం చేయుచున్నారని గుర్తించడమైనది. ఇది పూర్తిగా దుష్ప్రచారం మరియు అవాస్తవం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి దాని “టీ” జంక్షన్ వ్యూ పాయింట్ ను సాధారణ మాక్ డ్రిల్ల్స్ లో భాగంగా మాత్రమే విడదీసి వేరు చేయడమయినది, సముద్ర ప్రవాహాలు తీవ్రంగా (హై టైడ్) ఉన్నప్పుడు ఇది సాదారణంగా చేపట్టే సాంకేతిక పరిశీలనలో భాగమని, భవిష్యత్తులో కూడా అవసరమైన సంధర్భాలలో ఇటువంటి మాక్ డ్రిల్ల్స్ ను చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు అధికారులు .
ముందు వెనుకా ఆలోచించకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విశాఖ బ్రాండ్ ని దెబ్బతీసేలా ఒక వర్గం నిత్యం తప్పుడు ప్రాచారలు చేయడం గత నాలుగేళ్ళుగా పరిపాటిగా మారింది. పర్యాటకం కోసం ఏర్పాటు చేసిన వాటిని ప్రజలు ఉపయొగించుకోకుండా వారిని భయపెట్టే విధంగా ఇలా ప్రచారం చేయడం క్షమించరాని తప్పు ఇది కేవలం రాష్ట్రా ద్రోహులు మాత్రమే చేయగలరని విశాఖ వాసులు మండి పడుతున్నారు.