ఎన్నికల నేపథ్యంలో ప్రతీ రాజకీయ పార్టీ తమ సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు కొత్త కొత్తగా టార్గెట్ పెడుతుంటాయి. ఇందులో కేవలం టీడీపీ సోషల్ మీడియాకు ఒక విభాగం పేరు పెట్టి, గత మూడు సంవత్సరాలుగా దానికి ప్రెసిడెంట్ గా వున్న నారా లోకేష్ కొత్త పుంతలు తొక్కించారు. తమ సోషల్ మీడియా విభాగానికి ‘ ఐ టీడీపీ ‘ అని పేరు పెట్టి వారి ద్వారా కేవలం వైసీపీ నాయకుల మీద దాడి చెయ్యడమే ఏకైక లక్ష్యంగా పని చేశారు. దీని కోసం కొంతమందిని డైరెక్ట్ గా ఉద్యోగాల కింద నియామకం చేసుకొని వారికి పార్టీలో సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా వుండే కార్యకర్తలను అనుసంధానం చేసి ‘ మన టీడీపీ ‘ యాప్ ద్వారా తమ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు టీడీపీ నాయకులు.
ఈ యాప్ లో పార్టీ కోసం పని చేసి రోజు వైసీపీ నాయకులను , ముఖ్యంగా జగన్ ను వ్యక్తిగతంగా తిట్టాలి, అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఎవరైన పొగిడిన వారిపై వ్యక్తిగతంగా దాడి చేసి ఎవరూ జగన్ ప్రభుత్వము తరుపున మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీనికి గాను వారి పోస్టుల బట్టి వారి రీచ్ ను బట్టి పాయింట్ లు కేటాయిస్తారు. ఒక్కో లెవల్ కి కొన్ని పాయింట్స్ అని నిర్ణయించారు. ఆయా లెవల్స్ ప్రకారం పాయింట్లు, పాయింట్ల ప్రకారం మీ అర్హతని నిర్ణయించేది టీడీపీ మొబైల్ యాప్.
దీనిలో 5,00,000 పాయింట్లు అయితే లెవల్ 10 గా ఇక్కడ లోకేష్ ఫోన్ లేదా వీడియో కాల్ చేస్తారు అని, 6,00,000 పాయింట్లు అయితే లెవల్ 11 గా ఇక్కడ జిల్లా నాయకులతో ప్రత్యేక సన్మానం, ,700000 పాయింట్లు అయితే లెవల్ 12 గా ఇక్కడ పార్టీ లో పదవులు లభిస్తాయి అని , 8,00,000 పాయింట్లు అయితే లెవల్ 13 గా ఇక్కడ డైరక్ట్ గా ఈ సోషల్ మీడియా కర్త, కర్మ అయిన నారా లోకేష్ స్వయంగా కలుస్తారు. చివరగా 10,00,000 పాయింట్లు అయితే లెవల్ 14 గా ఇక్కడ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కలుస్తారు అని ప్రకటించారు.
నారా లోకేష్ నాయకత్వంలో పని చేసే ఈ విభాగం కేవలం వైసీపీ నాయకులను వ్యక్తిగతం గా టార్గెట్ చెయ్యడం, రోజూ వందల కొద్ది ఫేక్ వార్తలు , వీడియోలు వదలడమే వారి అజెండా . అందులో నారా లోకేష్ స్వయంగా చెప్పే మాట ఎంత ఎక్కువ తిడితే అంత రాజకీయ పోస్టులు అని ఎన్ని ఎక్కువ కేసులు వుంటే అంతా పెద్ద పోస్టు అని రెచ్చ గొడుతూ విపరీత ధోరణులకు ఉసిగొల్పుతున్నారు. ఇప్పటికే వీరి మూలంగా గీతాంజలి అనే మహిళ చనిపోయిన విషయం, వైఎస్ భారతి ,జగన్ మీద నీచ స్థాయికి దిగజారి పోస్టులు పెడుతున్న విషయం అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఎలక్షన్ వేడి ఉంది కాబట్టి నారా లోకేష్ మాటలకు చేతలకు అడ్డు అదుపు ఉండదని, కార్యకర్తలు కూడా ఎలక్షన్ వేడి మీద ఇంకా ఎంతకు దిగజారి పోస్టులు పెడతారో అని సీనియర్ రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.