టీడీపీ హయాంలో 1613 రహస్య జీవోలు వెన్నెల వెలుగులా అంటూ వైసీపీ సోషల్ మీడియా సెటైర్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో పారదర్శకత గురించి టీడీపీ నేతలు మాట్లాడేది వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. బోగి మంటల సాక్షిగా పరిటాల సునీత “ జగన్ పరిపానలంతా చీకటి జీఓలు, కక్ష్య సాధింపులే “ అంటూ అబద్ధపు ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1613రహస్య జీవోలు రిలీజ్ అయ్యాయి.. శాఖల వారీగా దోచుకునేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి మరీ దోచుకుంది టీడీపీ..
గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 2008 లో జీవోలను ప్రభుత్వ డొమైన్ లో ఉంచటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టారు. కానీ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హాయంలోనూ.. చంద్రబాబు ప్రభుత్వంలోనూ జీఓలు కాన్ఫిడెన్షియల్ లో ఉంచటం జరిగింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆన్ లైన్ లో జీవోలు పెట్టకూడదని నిర్ణయించి.. జీవోలను ఆఫ్ లైన్ లో పెట్టేలా చర్యలు తీసుకున్నారు. అంతే కానీ ఎక్కడా రహస్య జీవోలతో దోచుకునే రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు.. పారదర్శకంగా పరిపాలన అందిస్తూ.. రాష్ట్ర సంపధైన ప్రతి రూపాయి ప్రజలకోసమే ఖర్చు చేస్తుంది వైఎస్ జగన్ ప్రభుత్వం.
జీవో నెంబర్ 1 తో ప్రతిపక్షాల గొంతు నొక్కుతారంటూ పరిటాల సనీత అన్నారు.. అయితే చంద్రబాబు పర్యటనలో భాగంగా తొక్కిసలాట జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై, కూడళ్లలో సభలు నిర్వహించకూడదని జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం రాజకీయ పార్టీలు రోడ్లపై సభలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు. అందులో తప్పేంలేదు.. రాజకీయ పార్టీల విపరీత పోకడలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వైసీపీ ఈ జీవో తీసుకువచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని పరిటాల సనీత ఆరోపించారు.. అయితే అవినీతి అక్రమాలు చేసి అడ్డగోలుగా సిల్క్ స్కామ్ లో దోచుకోని పట్టుబడిన చంద్రబాబుపై ఎవరూ కక్ష్య సాధింపు చర్యలు జరపలేదు.. అది చట్టం తన పని తాను చేసుకుపోవడం..
రానున్న సంక్రాతికి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వస్తుందని సునీత దీమా వ్యక్తం చేశారు.. నిజమే రానున్నది ప్రజలు మెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి .