దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది, మన రాష్ట్రంలో ఏప్రిల్ మూడో వారంలో 18 న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ లోపల రాష్ట్ర ఎన్నికలసన్నద్ధతను, ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించినున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇక ఇప్పుడు క్షేత్ర స్థాయిలో తెలుసుకుందామని జిల్లాల వారీగా పర్యటించనున్నారు .
ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే సరికి వీలయినన్ని జిల్లాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్వయంగా తెలుసుకుందామని వారానికి మూడు జిల్లాల చొప్పున తిరగటానికి నిర్దేశించుకున్నారు. క్షేత్ర స్థాయిలో కీలకమైన జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు, ఫిర్యాదులు అందుకునే సిస్టంను పరిశీలించి వాటిమీద ఎలాంటి చర్యలను తీసుకుంటున్నారో స్వయంగా తెలుసుకుందామని అనుకుంటున్నారు. అలాగే అత్యంత కీలకమైన ఈవీయం లను భద్రపరిచే ప్రదేశాలని చూడటం అక్కడ ఏర్పాటు చేసిన సెక్యూరిటీని చూడటం, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి తగు జాగ్రత్తలను తీసుకున్నారో లేదో పరీక్షించడానికి వెళ్తున్నారు.
ఇప్పటికే ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఏలూరులో మీడియా కంట్రోల్ రూమ్ ను సందర్శించారు, ఫిర్యాదుల విభాగాన్ని పరిశీలించి వాటి మీద చర్యలు ఎలా తీసుకుంటున్నారో స్వయంగా తెలుసుకున్నారు, తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి లో ఈవీఎంలు భద్రపరచే కేంద్రానికి వెళ్ళి సెక్యురిటి నీ గమనించారు. వచ్చేది వేసవికాలం కాబట్టి తగు జాగ్రతలు తీసుకోమని వచ్చిన వారికి వాటర్, ఫ్యాన్లు అందుబాటులో వుంచాలని జిల్లా ఎన్నికల అధికారులకు కలెక్టర్ లకు సూచించారు.