ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీకి లబ్ది చేకూరేలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య కథనాలను ప్రచురిస్తూ వస్తున్న ఈనాడు మరోసారి మూలధన వ్యయం (అభివృద్ధి , మౌలిక వసతులు, ఆస్తుల కల్పన )లో ఏపీ దేశంలోనే అట్టడుగున ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయని మరో అసత్య కథనాన్ని అచ్చేసింది. పాఠకులను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా పని చేస్తున్న రామోజీ, మూలధన వ్యయంలో ఏపీ అట్టడుగున ఉందనే అవాస్తవ కథనం ప్రచురించింది.
కానీ ఈనాడు ప్రచురించిన కథనానికి భిన్నంగా వాస్తవాలు ఉన్నాయి. టీడీపీ హయాంలో ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.76,139 కోట్లు కాగా సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.15,227 కోట్లగా ఉంది. జగన్ హయాంలో మూడేళ్లలో మూలధన వ్యయం రూ.55,086 కోట్లగా ఉండగా సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.18,362 కోట్లుగా ఉంది. అంటే నాటి బాబు హయాంతో పోలిస్తే 3000 కోట్లు అధికంగా మూలధన వ్యయం ఉంది.
కాగ్ లెక్కల ప్రకారం (ఆగష్టు 2023 నాటికీ )బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయం(అభివృద్ధి లో 2 వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కాగ్ నివేదిక ప్రకారం మూలధన వ్యయంలో 49.12 శాతంతో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా 40.79 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని మరుగున పరుస్తూ ప్రజలను ఏమార్చే కథనాలు రాయడం రామోజీకి పరిపాటిగా మారింది. జర్నలిజం విలువలను దిగజారుస్తూ నిజాలకు పాతరేస్తూ, రామోజీ ప్రచురిస్తున్న అసత్య కథనాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.
కాగ్ నివేదిక ప్రకారం మూలధన వ్యయంలో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు..