టీడీపీ హయాంలో బడులు తెరిచాక అక్టోబరు నవంబరు నెలలు వచ్చినా పాఠ్య పుస్తకాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా పేదపిల్లలను అష్టకష్టాలు పెట్టిన టీడీపీ ప్రభుత్వంపై ఆనాడు ఒక్క కథనం కూడా రాయలేదు. ఈ ఈనాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడులు ప్రారంభించిన మొదటి రోజునే విద్యార్థుల చేతిలో విద్యాకానుక పెడుతున్నప్పుడు కూడా మెచ్చుకోలుగా ఒక్కవార్త రాయలేదు.. కానీ ఆ నిధులు ఎవరి జేబులోకి అంటూ వార్త రాసి వైఎస్సార్సీపీ పాలనపై అక్కసును బయటేసుకుంది.
జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్ధులకు నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్,బ్యాగులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, యూనిఫార్మ్, షూలు, బెల్టులు అన్ని వస్తువులు స్కూలు తెరిచే సమయానికి వారిచేతికి ఇస్తోంది. అందుకోసం ప్రస్థుతం ఉన్న విద్యార్ధుల సంఖ్యకు 5% పెంచి( రానున్న సంవత్సరానికి కొత్త అడ్మీషన్ల కోసం) విద్యా కానుక కిట్ల టెండర్స్ పిలిచి సప్లయ్ ఆర్డర్ ఇచ్చేటప్పటికీ ఉన్న విద్యార్థుల యథార్థ సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఆమేరకు మాత్రమే కిట్లకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆధారంగానే విద్యా కానుక కిట్లు తీసుకుంటారు.
అంతేకాకుండా విద్యార్థుల ఎన్రోల్మెంట్ కు మించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం విద్యార్థులు రీజాయిన్ అయిన విద్యార్థులకు కూడా కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి కిట్లు ఎక్కడా దుర్వినియోగం జరిగే ఛాన్స్ లేదు. ఏ ఒక్క విద్యార్థికీ కూడా కిట్ అందలేని పరిస్థితి లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వాస్తవ విద్యార్థుల సంఖ్యకు అదనంగా ఉన్న కిట్లను ఆ సంవత్సరంలోనే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్ఎస్లోని ఇంటర్మీడియట్ తో పాటు అవసరమైన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్దతిలో కిట్లు వృథా కావడానికి అవకాశం లేదు.
ఏకరూప దుస్తులు రెండు జతలకే సరిపోతుందన్న ఈనాడు ఆరోపణ పూర్తిగా అవాస్తవం. విద్యార్థుల దుస్తుల కొలతలను శాస్త్రీయంగా కొలిచి, తరగతుల వారీగా నమూనా దుస్తులను కుట్టించి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. దుస్తులు మూడు జతలకు సరిపడేలా కుట్టే విధానాన్ని వీడియో ద్వారా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది.
విద్యార్థుల పాదాల కొలతలు కనీసం ఆరు నెలల ముందుగా తీసుకోవడం జరుగుతుంది. పిల్లలంతా ఎదిగే వయసులో ఉంటారు. బూట్లు పంపిణీ చేసిన తర్వాత కొలతల్లో వ్యత్యాసం ఉన్నట్లయితే మిస్ మ్యాచ్ అయిన బూట్లు కూడా రీప్లేస్ మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి తగిన స్టాకు జిల్లాల్లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
మెరుగైన, నాణ్యతతో కూడిన వస్తువులను సరఫరా చేయాలనే ఉద్దేశంతో క్యూసీఐ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వారు నిర్ధారించిన స్పెసిఫికేషన్లతో కూడిన వస్తువులను కొనుగోలు చేసి, విద్యార్థులకు జేకిట్లు సరఫరా చేయడం జరుగుతుంది. ధరలు అనేవి రివర్స్ టెండర్ ద్వారా నిర్ణయించబడతాయి. విద్యార్థులకు జేవీకే కిట్లు పారదర్శకమైన రీతిలో బయోమెట్రిక్ అథంటికేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. బయో మెట్రిక్ లో ఏవైనా సాంకేతిక లోపం తలెత్తితే ఆఫ్ లైన్ రూపంలో నమోదు చేయడం జరుగుతుంది.
ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్టేజ్ లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేస్తుంది. ప్రభుత్వంపై బురద జల్లే ఆలోచనలే తప్పా పేద ప్రజలకు మంచి జరుగుతుందన్న విషయాన్ని టీడీపీ, ఎల్లో మీడియా విస్మరించడం బాధాకరం .