రోజూ జగన్ సర్కారుపై బురదజల్లేందుకు వెంపర్లాడే ఈనాడు పత్రిక కాపులకు ఇచ్చే సీట్ల విషయంలో కూడా పచ్చద్దాల రాతలతో మాయ చేసే ప్రయత్నం చేసింది. పవన్ కల్యాణ్ ప్రభావం నుంచి కాపు ఓట్లను చీల్చేందుకు, జగన్ ప్రభుత్వం ముద్రగడ, వంగవీటి కుటుంబాలపై దృష్టి పెట్టి పద్మనాభం లేదా ఆయన కుమారుడికి కాకినాడలో టికెట్ కేటాయించి వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఈనాడు రాసుకొచ్చింది.
ఈనాడు కథనంలోని సారాంశం ఏమంటే కాపుల ఓట్లు పవన్ ద్వారా గంప గుత్తగా అది కూడా కేవలం 20 సీట్లు ఇచ్చిన టీడీపీకి పడాలి తప్ప కాపులు మాత్రం రాజకీయంగా ఎదగకూడదన్నదే ఈనాడు ఉద్దేశ్యంగా కనబడుతుంది. కాపులను రాజకీయంగా ఎదగనివ్వడం ఇష్టం లేని టీడీపీకి మద్దతుగా ఈనాడు కలమెత్తడం ఈనాడుకి చంద్రబాబుకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదో తేల్చి చెబుతుంది. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధాలు వైసీపీలో చేరితే ఈనాడుకు ఏడుపెందుకన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
రాజకీయంగా కాపులను ఎదగనివ్వని టీడీపీ
కాపులను రాజకీయంగా ఎదగనివ్వడానికి టీడీపీ మొదటినుండి ఇష్టపడలేదు. బలమైన కాపు లీడర్లను అణగదొక్కడానికి టీడీపీ చేయని ప్రయత్నం లేదు. తాజాగా తాము అధికారం లోకి వస్తే పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి కాదు కదా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వమని చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలలో తేల్చి చెప్పిన విషయమే కాపులకు టీడీపీ ఇచ్చే విలువకు నిదర్శనంగా చెప్పొచ్చు. కాపు దిగ్గజాలైన వంగవీటి రంగా, చిరంజీవి, ముద్రగడ పద్మనాభంలను అనేక సందర్భాల్లో దారుణంగా అవమానించింది టీడీపీ, అధికారంలో ఉన్న అయిదేల్లో తమ పార్టీలో చేరిన వంగవీటి రాధకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు. తమ అభిమాన నాయకుడైన వంగవీటి రంగా కుమారుడికి టీడీపీ చేసిన అన్యాయాన్ని కాపులు ఎన్నటికీ మర్చిపోలేరు.
కాపులను దారుణంగా అవమానించిన టీడీపీ
కాపులను అనేక సందర్భాల్లో టీడీపీ ఘోరంగా అవమానిస్తూనే ఉంది. ఈ విషయాన్ని పలువురు కాపు నాయకులు పలు సందర్భాల్లో వెల్లడించారు. కాపు దిగ్గజ నాయకుడైన వంగవీటి రంగా తనను టీడీపీ పెద్దలు చంపాలని చూస్తున్నారని, రక్షణ ఇవ్వండని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే, ఆయనకు ఎలాంటి రక్షణ ఇవ్వకుండా, దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను నరికి చంపించింది టీడీపీ ప్రభుత్వమే అని పలువురు నాయకులు బహిరంగంగా వెల్లడించారు. రంగా హత్య గురుంచి చంద్రబాబుకు ముందే తెలుసని హరిరామజోగయ్య పుస్తకంలో రాసుకొచ్చారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ త్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో చంద్రబాబు తనను రంగాను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. నేను తృటిలో తప్పించుకున్నాను కానీ రంగా బలయ్యాడని కన్నా లక్ష్మి నారాయణ చెప్పడం కాపు సోదరులు మర్చిపోరు.
నిజాలను నిర్భయంగా రాసే పత్రికగా సంచలనం సృష్టించిన దాసరి నారాయణరావు గారి పత్రిక ఉదయం మూతపడటానికి కారణం ఈనాడు రామోజీ రావే అన్నది బహిరంగ రహస్యం. ముద్రగడకు చిరంజీవితో పాటు నేను కూడా మద్దతు ఇవ్వకపోతే రంగాను హత్య చేసినట్లే ముద్రగడను కూడా హత్య చేసేందుకు టీడీపీ వెనుకాడేది కాదని ఓ సందర్భంలో దాసరి వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలి టీడీపీ లాభపడుతుందని భావించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మొదట్లో తన పార్టీని ప్రోత్సహించి తరువాత తన పార్టీ వల్ల టీడీపీకి నష్టం కలుగుతుందని భావించి తనపై తన పార్టీపై విషప్రచారం చేశాయని చిరంజీవి ఓ ప్రెస్మీట్ లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ప్రెస్ మీట్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమానులు ఈనాడు జ్యోతి పత్రికలను తగలబెట్టారు. జనసేన వెనక ఉన్నది సంకరజాతి జనాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించడం కాపుల పట్ల టీడీపీ పెద్దలకున్న చులకన భావంగా అర్థం చేసుకోవచ్చు.
టీడీపీతో పవన్ కళ్యాణ్ పదనిసలు
తాజాగా టీడీపీ జనసేన పొత్తు విషయం ఇష్టంలేని వాళ్ళు తన పార్టీ నుండి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసిన పవన్ నాకు పరిటాల రవి గుండుకొట్టించాడని, ప్యాకేజ్ ఇచ్చారని మొదట ప్రచారం చేసింది టీడీపీనే అని కుండబద్దలు కొట్టారు. నాకు 10 – 15 సీట్లు పడేస్తే కుక్కలా పడి ఉంటాడని ఈ టీడీపీ వాళ్ళు అంటున్నారని బాధపడ్డారు. నేను టీడీపీ ని గెలిపిస్తే వారేమో సామజిక మాధ్యమాల్లో మా అమ్మను తిట్టించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని ఎవరూ మర్చిపోలేరు. బాబు లోకేష్ లక్ష కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టిన పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో ఎన్నాళ్లీ టీడీపీ పల్లకి మోయాలి మనకు సిగ్గు పౌరుషం లేదా అంటూ రెచ్చిపోయాడుబి కానీ ఇప్పుడేమో అదే టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని కాపులని టీడీపీ పల్లకి మోయమని ప్రోత్సహిస్తున్నాడు.
కాపులని ప్రోత్సహించి వారిని బలమైన నాయకులుగా తీర్చిదిద్ధేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తుంటే వారికి టికెట్లు ఇవ్వడమే నేరం అన్నట్లుగా రామోజీ విషం కక్కడం శోచనీయం. ఇలా ఓ పార్టీకి లబ్ది చేకూర్చే రాతలు రాస్తూ కాపులకి ద్రోహం చేస్తున్న పత్రికలను నాయకులను బుద్ది చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది.