ఈనాడు అలియాస్ ఈనాయుడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మెదళ్లలో నిత్యం విషం నింపుతూ ఉంటుంది. దిగజారుడు రాతలు రాయాలంటే రామోజీ పత్రికకు చాలా ఇష్టం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తిరుగుండదని, ఎలాంటి అరాచకాలు చేసినా అడిగే వారుండరని ఈనాయుడి భావన. అందుకే నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై దుష్ప్రచారానికి తెగబడుతూ ఉంటుంది. పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ తన పార్టీ అభ్యర్థులను అశేష ప్రజానీకానికి పరిచయం చేశారు. వారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. దీనిపై ఈనాయుడు పాత్రికేయ విలువలను వదిలేసి అభ్యర్థులను హేళన చేస్తూ కట్టు కథలు రాసింది. సీఎం ఎంతో ఆప్యాయంగా తన వారిని తమ్ముడు, సౌమ్యుడు, మంచివాడని చెబితే వాటికి వక్రభాష్యాలు చెప్పి మురిసిపోయింది.
నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్‌ను తమ్ముడు –1 అని, అతను నెల్లూరులో రౌడీయిజానికి చిరునామా, జుగుప్సాకర భాషలో మాట్లాడతాడని ఈనాయుడు రాసింది. రామోజీ.. తన పార్టీ అధినేతను అనారాని మాటలు అంటుంటే అనిల్ గట్టిగా సమాధానం చెప్పాడు. ప్రజలపై ఏనాడూ ఆగ్రహం చూపించలేదు. ప్రత్యర్థి పార్టీల వారి విమర్శలకు గట్టిగా సమాధానమిస్తే అది జుగుప్సాకర భాష అవుతుందా. నెల్లూరులో రౌడీయిజం చేసిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ రూరల్ అభ్యర్థిగా ఉన్నారు. అతని వ్యవహారశైలి నచ్చక జగన్ దూరం పెడితే చంద్రబాబు అక్కున చేర్చుకుని రౌడీయిజం చేసుకోమని లైసెన్స్ ఇచ్చాడు. నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ ఎప్పుడూ జనంలో లేడు. ఒకవేళ అప్పుడప్పుడు వచ్చినా ఆయన్ను పేదలు కలవలేరు. నగర ప్రజలతో మమైకమైంది ఒక్క అనిల్ మాత్రమే. టీడీపీ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మంచినీరు సరఫరా పేరుతో ఊరిని నాశనం చేస్తే అండగా నిలించింది అనిలే. కరోనా కాలంలో నారాయణ హైదరాబాద్‌లో దాక్కుంటే ప్రజలకు అండగా నిలిచింది అనిలే. అధినేత చెప్పడంతో నరసారావుపేటకు వచ్చాడు. ఇంత లాయల్‌గా ఉండే మనిషి తమ పార్టీలో ఉంటే బాగుంటుందని సింహపురం తెలుగు తమ్ముళ్లు అంటూ ఉంటారు. కావాలంటే వచ్చి కనుక్కోవచ్చు. అయినా యాదవ సామాజికవర్గం వారంటే ఎల్లో గ్యాంగ్‌కు అంత అక్కసు ఏలా..
ఔరా ఉత్తమ గుణాల అంబటి.. అంటూ రాశారు. రాంబాబు నోటి నుంచి అప్పుడప్పుడు దురుసుగా మాటలు వచ్చినా మనసు వెన్న అని జగన్ అన్నారు. దీనికి ఈనాయుడు తనకు తోచింది రాసింది. అబంటి ఏనాడూ ప్రజానీకాన్ని అనలేదు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను గట్టిగా ప్రశ్నించారు. అంటే వారు అన్నిటికీ అతీతులా.. బోండా ఉమ, అయ్యన్న పాత్రుడి కంటే మంచి భాషే ఈయన ప్రెస్మీట్లలో మాట్లాడాడు. ఇక మీరు చేసిన ఆరోపణలపై ఏనాడో ఖండన ఇచ్చారు. కానీ ఇంకా అవే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అక్రమాల గురించి చెబుతూ పోతే రోజులు సరిపోవు. కోడెల శివప్రసాద్ చావుకి కారణం టీడీపీనే. అతని కుమారుడు శివరామ్‌కు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన విషయాన్ని కాస్త చెప్పాలి కదా ఈనాయుడు వారూ..
గురజాల అభ్యర్థి కాసు మహేస్రెడ్డి తమ్ముడు 3, అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని రాసుకొచ్చారే.. అసలు చెప్పాల్సింది టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురించి కదా.. ఆయన మైనింగ్ డాన్ అని పల్నాడు జిల్లాలో అందరికీ తెలుసు. కేసు నమోదైంది. సీబీఐ విచారణ వరకు వెళ్లింది. గ్రానైట్ మాఫియాను నడిపింది ఈయనే. వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నీ దాచేసి మహేష్‌రెడ్డిపై ఏడిస్తే ఎలా.. నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా చేయించిన వ్యక్తి మహేష్‌రెడ్డి. రాజకీయంగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిడుగురాళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు బైపాస్ నిర్మాణం చేయించారు. తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
హవ్వ.. సౌమ్యుడు, స్నేహితుడు –1 మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈనాయుడు అబద్ధాలను అచ్చేసింది. నిజంగా ఆయన అలాంటి వ్యక్తి అయితే ప్రజలు వరుసగా ఎందుకు గెలిపిస్తున్నట్లు.. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన ఉండకూడదని కంకరణం కట్టుకున్న వ్యక్తి పిన్నెల్లి. వరికశెలపూడి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చడలంలో ప్రముఖ పాత్ర ఈయనదే. ప్రభుత్వంతో మాట్లాడి మాచర్ల అభివృద్ధికి కృషి చేస్తోంది ఎవరో ప్రజలకు తెలుసు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి హత్యా రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు. అతని తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు అండతో ఎన్నో కుటుంబాల్లో దీపాలు ఆర్పేసిన వ్యక్తి బ్రహ్మానందరెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. ఇతని గురించి దాచేసి ప్రజలకు అండగా ఉన్న పిన్నెల్లిపై పిచ్చి రాతలు రాస్తే ఎలా..
సౌమ్యుడు–2 అంటూ వినుకొండ అభ్యర్థి బ్రహ్మనాయుడి గురించి కట్టు కథలు రాశారు. ఈయన హయాంలోనే వంద పడకల ఆస్పత్రి వచ్చింది. రోడ్ల విస్తరణ జరిగింది. కాలువ కట్ల సుందరీకరణ పనులు చేయించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఘన కార్యాల గురించి అందరికీ తెలిసిందే. నియోజకవర్గంలో 24 వేల దొంగ ఓట్లను టీడీపీ నమోదు చేయించిన ఘనుడు. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎలాంటి అరాచకాలు చేశారో ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఓడించారు. ఈయన గురించి కదా చెప్పాలి రామోజీ..
సౌమ్యుడు–3 గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అసత్యాలను ఈనాయుడు రాసింది. కరోనా సమయంలో వేల ప్రాణాలు నిలిచాయంటే కారణం ఈయనే. మహమ్మారిని లెక్క చేయకుండా ప్రజలకు అండగా నిలిచారు. జగన్ చెప్పినట్లు సౌమ్యంగానే ఉంటారు. ఏనాడూ చిల్లర రాజకీయాలు చేయలేదు. నరసారావుపేట జిల్లా కేంద్రం కావడానికి, రెవెన్యూ డివిజన్‌గా విస్తరించడానికి కారణం ఈయనే. గోపిరెడ్డి కృషితోనే జేఎన్టీయూ అభివృద్ధి రూ.150 కోట్లతో జరిగింది. కోటప్పకొండను అభివృద్ధి చేశారు. ఇక టీడీపీ అభ్యర్థిగా చదలవాడ అరవింద్బాబే ఉన్నారు. ఈయన నిర్వాకాలు తెలుసు కాబట్టే చంద్రబాబు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. కానీ పోటీ చేసే దిక్కు లేక చివరికి అవకాశం ఇచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేయడం ఈయనకు వెన్నతోపెట్టిన విద్య. వీటి గురించి కాస్త చెప్పాలి కదా ఈనాడూ..
మంచివాడు–1 అంటూ పెదకూరపాడు అభ్యర్థి నంబూరు శంకర్రావు గురించి రాసుకొచ్చారు. ఈయన ఎంతో మంది పేదలకు సొంత డబ్బు దానం చేసిన వ్యక్తి. అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు టీడీపీ నాయకులను చర్చకు పిలేస్తే రాలేదు. రూ.27 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్పివేశారు. అమరావతి – బెల్లకొండ రోడ్డును రూ.149 కోట్లతో వేయించారు. రూ.7.25 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ కట్టించారు. టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెలే కొమ్మలపాటి శ్రీధర్‌ను కాదని చంద్రబాబు టికెట్‌ను ప్రవీణ్‌కు అమ్మేశారు. ధన బలంతో ఇతను రాజకీయాలు చేస్తున్నాడు. ఈ విషయాలను దాచిపెట్టి శంకర్రావుపై పిచ్చి రాసేసింది ఈనాడు.
మంచివాడు – 2 అంటూ చిలకలూరిపేట అభ్యర్థి కావటి మనోహర్ నాయుడి గురించి ఈనాడు అడ్డదిడ్డంగా రాసేసింది. గుంటూరు మేయర్‌గా ఉన్నప్పుడు కాలుష్య రహిత నగరంగా దేశంలో మూడో స్థానంలో రావడానికి ప్రధాన కారణం ఈయన. కార్పొరేషన్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు కాబట్టే జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతి గురించి అందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో, అమరావతి భూముల విషయంలో ఈయన కుటుంబం పాత్ర ఉంది. పుల్లారావు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో చెప్పకుండా మనోహర్‌పై పడి అబద్ధాలు చెప్పింది ఈనాయుడు.