ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళకేంద్ర ఎన్నికల సంఘం కీలక అధికారులును విధులు నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానాలలో కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ ను ఎంపిక చేసింది. కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ కి చెందిన అధికారి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ ను ఎంపిక చేసింది. పీహెచ్డీ రామకృష్ణ 2006 బ్యాచ్ కి చెందిన అధికారి. కాగా అధికారాలు నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీనియర్ అధికారులు పేర్లు పంపమని కోరిన విషయం తెలిసిందే.
ఇద్దరి స్థానంలో కొత్త వారి నియామకం కోసం పేర్లని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది ఎన్నికల సంఘం . ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, అఖిల్ సింగ్ పేర్లను ప ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ గా పీహెచ్డీ రామకృష్ణ, త్రివిక్రమ్ వర్మ, వినీత్ బ్రిడ్జ్ లాల్ పేర్లను ప్రతిపాదిన చేసినట్లు సమాచారం.
కాగా ప్రభుత్వం ప్రతిపాదించిన లిస్టు నుండి ఇంటెలిజెన్స్ చీఫ్ గాకుమార్ విశ్వజిత్ ను, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా పిహెచ్డి రామకృష్ణ ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం .
ఇప్పటివరకు ఎన్ని కల నోటిఫికేషన్ విడుదల జరిగిన తర్వాత ఆరుగురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసింది. ఎన్నికల నియమావళి పూర్తి అయ్యేలోపు మరి ఎంతమందిపై వేటు పడుతుందో చూడాలి.