జయప్రకాశ్ నారాయణపై ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
ఎన్నికల రావడం లేటు అప్పటి దాకా కలుగులో దాకున్న ఎలుకుల ఉండి, ఎన్నికలు రాగానే మేధావి ముసుగులో బయటికి వచ్చి తమ కులం పార్టీకి మద్దతు తెలపడం లోకసత్తా పార్టీ మాజీ అధ్యక్షడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణకు పరిపాటిగా మారింది. ఎన్నికల తదనంతరం రెండు సంవత్సరలు గమ్మున ఉండడం, తర్వాత ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించడం తద్వారా ప్రజలని ఆకర్షించడం తర్వాత ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పడం తన మద్దతును తెలుగుదేశం కి తెల్పడం, గత 15 ఏళ్లుగా జయప్రకాష్ నారాయణ చేస్తున్న తంతు ఇది. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు మెచ్చుకొని, మీడియా ముందు బాగా చేశాడు అని వూదరకొట్టి ఇప్పుడు చడి చప్పుడు కాకుండా తన కులానికి చెందిన పార్టీకి తన పూర్తి మద్దతు అంటూ తెలియజేశాడు. నాడు నేడు లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్, 4 పోర్టులు నిర్మాణం, 10 ఫిషింగ్ హార్బర్, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు , ఎన్నో సాఫ్ట్వేర్ కంపనీ లు, గ్రీన్ ఎనర్జీ లో భాగంగా పెట్టుబడులు ఇలా ఇన్ని చేశారు అని మీడియా ముందు చెప్పి నేడు మాత్రం చంద్రబాబుతో రాష్ట్ర అభివృధి అంటే ఎలా జయప్రకాష్ నారాయణ అంటూ పోసాని ప్రశ్నలు సంధించారు.
మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్దతు తెలుపుతున్నారు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్దతివ్వడం సిగ్గుచేటు 2014-2019 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు అని మద్దతు తెలుపుతున్నాడని సూటిగా ప్రశ్నించారు . చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దోచుకున్నారని చెప్పిన జయప్రకాష్ నారాయణ ఈ రోజు టీడీపీ కి ఎలా మద్దతు ఇస్తారు అని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగాను చంపిన వ్యక్తి చంద్రబాబు అని సందర్భంగా తెలిపారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనము అవుతుంది అన్నారు. కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్ చేయను. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది. బాబు మోసాలను గమనించే 2019లో జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు అని పోసాని తెలిపారు. రాన్నున ఎన్నికలలో ప్రజల మద్దతుతో రెండో సారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని మీడియాతో వెల్లడించారు.