ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్న అసూయతో ఆయన కులానికి చెందిన కొందరు కుమిలిపోతూ వచ్చారు.. వారంతా సీఎం జగన్ పై ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానిపై బురద జల్లడం ఈ పెద్ద మనుషులకు అలవాటు.. జగన్ పై ముందు నుంచి నిమ్మగడ్డ ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ, చలసాని, గరుడ పురాణం శివాజీ దాడి చేయడం ప్రారంభించారు. పాలనలో […]
జయప్రకాశ్ నారాయణపై ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఎన్నికల రావడం లేటు అప్పటి దాకా కలుగులో దాకున్న ఎలుకుల ఉండి, ఎన్నికలు రాగానే మేధావి ముసుగులో బయటికి వచ్చి తమ కులం పార్టీకి మద్దతు తెలపడం లోకసత్తా పార్టీ మాజీ అధ్యక్షడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణకు పరిపాటిగా […]
తనను తాను మేధావిగా ప్రకటించుకుని చంద్రబాబుకు అవసరం అయినప్పుడల్లా ఆయన వెనుకనే ఉంటూ సకల ప్రయోజనాలు అందించే వాలంటరీ రిటర్మెంట్ తీసుకున్న ఐఏఎస్ జయప్రకాష్ గారు ఇప్పుడు కష్టకాలం లో మరోసారి బాబు వెనకే నేను అని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకోడమే కొత్తగానీ వెనుక ఉండటం ఏం కొత్త కాదు. టీడీపి పార్టీ ఆవిర్భావం నుండీ ఆయన టీడీపీ కి సానుభూతిపరుడే, ఎన్టీఆర్ కు అత్యంత దగ్గరగానే ఆయన పని చేసారు కూడా.. రిటర్మెంట్ తీసుకున్నాక 2009 లో […]
ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న వాళ్లంతా బయటికి వస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోసం అహర్నిశలు శ్రమించే మేధావులు ఎన్నికల నేపథ్యంలో తమ ముసుగులు తీసేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు కూటమికి మద్దతు ప్రకటిస్తూ వాళ్లే గెలవాలని రకరకాల కారణాలు చెబుతున్నారు. చంద్రబాబుకు ధైర్యం తక్కువ. పిల్లనిచ్చిన ఎన్టీఆర్ నుంచి లాక్కొన్న టీడీపీపై కూర్చొని వేరే పార్టీల సాయంతో స్వారీ చేస్తున్నారు. బీజేపీతో కలవడం.. విడిపోవడం ఆయనకు అలవాటే. తన కోసం పనిచేసే […]
చదువురానంత కాలం కాకరకాయ అని తీరా చదువు నేర్చుకున్నాక కీకరకాయ అనడం మొదలుపెట్టాడట. అలా ఉంది జయప్రకాష్ నారాయణ వ్యవహారం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా సొంత పార్టీ పెట్టి కొన్నాళ్ళు హడావిడి చేసిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తాజాగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తిరిగి […]