సీనియర్ యన్.టి.ఆర్ 28వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు అరిగిపోయిన క్యాసెట్ లాగా యన్ టి ఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మహానాడు లో 27 సార్లు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారు. కాని యన్ టి ఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పడు భారత రత్న కోసజం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఉన్న 14 సంవత్సరాలు కేంద్రం లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పొత్తులో ఉన్నాడు . అయిన భారతరత్న కోసం ఎలాంటి అడుగులు వేయలేదు. ఎప్పుడు వింటూ ఉంటాం కేంద్రం తన చెప్పుచేతల్లో ఉంది, నేను ఎంత చెపితే అంత అనే ప్రగల్భాలు పలికే చంద్రబాబు యన్ టి ఆర్ కు భారతరత్న తెచ్చుకోకపోవడం సిగ్గు చేటు.
మామ గొప్పతనం గురించి అల్లుడు గతంలో వెన్నుపోటు తర్వాత ఇండియాటూడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లోనీ ముఖ్యాంశాలు
ఎన్టీఆర్ కామాంధుడు , పెళ్లీడుకొచ్చిన మనుమళ్ళు మనవరాళ్లని ఇంట్లో పెట్టుకొని కామంతో కళ్ళుమూసుకొనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు . అసలు ఎన్టీఆర్ లో నైతిక విలువలు సూన్యం . అంతేకాదు ఎన్టీఆర్ అవినీతిపరుడు , ఒకపక్క మద్యనిషేధం అమలులో ఉంటే డిస్టలరీస్ బ్రేవరేజస్ కంపెనీల దగ్గర లంచాలు తీసుకొని మద్యం తయారీకి అనుమతులు ఇచ్చాడు . మాకు ఎన్టీఆర్ తో అవసరమే లేదు . ఆయనకీ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంభంధం లేదు . నన్ను పార్టీ అధ్యక్షుడుగా , ముఖ్యమంత్రిగా పార్టీ సభ్యులు ఎన్నుకొన్నారు . ఎన్టీఆర్ వాదన కోర్టులలో కూడా చెల్లదు , అసలు ఆయనకి మతి చలిoచింది .
దేవగౌడ ను, IK గుజ్రెల్ ను ప్రధానమంత్రి గా, అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేశాను అని చెప్పుకునే చంద్రబాబు సొంత మామకు భారతరత్న ఎందుకు తీసుకురాలేక పోయాడు. ఇలాంటి వ్యక్తి ఫలానా వాళ్ళను ఇది చేసా అది చేసా అని చెప్తే నమ్మడానికి ప్రజలు ఏమి అమాయకుల కాదు. ఆ రోజుల్లో ఈనాడు అలా జాకీలు పేట్టి లేపింది కానీ వాస్తవంగా అంతటి స్థాయి వ్యక్తి అయితే కాదు.