ఎన్టీఆర్ శాసనాలుగా పేరుగాంచిన ఆ పది సిద్ధాంతాలెంటంటే.. 1983 లో టీడీపీ తరుపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు.. ప్రజలతో మమేకమై పరిపాలన ఎలా సాగించాలంటూ ఎన్టీఆర్ 10 సూచనలు చేశారు. ఆ పదిలో మొదటి తొమ్మిది పక్కనపెడితే పదవది మాత్రం.. చంద్రబాబు చెయ్యలేనిది.. ఆయనకసలు చేతకానిది.. అదేంటంటే.. “ నిజాయితీగా ఉండటమే కాకుండా క్రమశిక్షణ, నిరాడంబరత కలిగి ఉండాలి.. ఎన్నికలు సమయంలో పార్టీ చేసిన వాగ్ధానాలు నెరవేర్చేందుకు ప్రతిన పూనాలి. “
పదవ సిద్దాంతంలో ఉన్న ఒక్క పదానికి కూడా చంద్రబాబు జీవితంలో అర్ధమే దొరకదు..
నీతి నిజాయితీలకు తర్పణాలు వదిలుతూనే టీడీపీ పార్టీలో చేరి ఎన్టీఆర్ గారిపై కుట్రలు చేసాడు చంద్రబాబు.. ఎన్నికలలో గెలిచేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు దిగజారినప్పుడే బాబు క్రమశిక్షణ క్రమం తప్పింది.. ఇక నిరాడంబరత విషయానికొస్తే హెలికాఫ్టర్ లో ఫ్రూట్ సాలడ్ తింటూ ఏరియల్ సర్వేలు, పుష్కర స్నానాలకు టాలివుడ్ డైరెక్టర్లతో షార్ట్ ఫిలింలు.. ఇలా అనేక రకాలుగా ఆయన నిరాడంబరత అటకెక్కింది.. చివరిగా.. ఎన్నికల సమయంలో పార్టీ చేసిన వాగ్ధానాలు నెరవేర్చేందుకు ప్రతిన పూనాలనేది ఎన్టీఆర్ గారి పదో శాసనంలో ముఖ్యమైన అంశం.. ఆ మేరకు చంద్రబాబు పనిచేసిన దాఖలాలే లేవు. 2014 ఎన్నికలలో గెలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిన్నా పెద్దా కలిపి 650 హామీలిచ్చాడు చంద్రబాబు.. గెలిచిన తరువాత ఐదేళ్ళ పాలనలో సక్రమంగా ఆ హామీలు అమలు చేసిన పాపాన పోలేదు సరికదా.. ప్రజలను పిచ్చి వాళ్ళను చేసేందుకు ఆ మేనిఫెస్టోను కనపడకుండా చేశాడు. ఇలా టీడీపీ ప్రతిష్టను.. ఎన్టీఆర్ ప్రతిష్టను చంద్రబాబు అబాసుపాలు చేస్తూనే వచ్చా డు. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మే, 2023 లో టీడీపీ మినీ మేనిఫెస్టో అంటూ అమలు చెయ్యలేని అబద్దపు హామీలు ఇస్తున్నాడు. రైతు భరోసా ఇస్తానని, ఉచితంగా వంట గ్యాస్ ఇస్తానని గతంలో చెప్పి చెయ్యని హామీలను మళ్ళీ ప్రజలపై రుద్దుతున్నాడు చంద్రబాబు..
ఎన్టీఆర్ గారి పది శాసనాలలో ఒక్క అంశాన్ని కూడా పాటించలేని రాజకీయ అసమర్ధుడు చంద్రబాబు..