ఒకపక్క హరికృష్ణ శవం పక్కనే ఉన్నా… అధికారం కోసం కేటీఆర్ మంతనాలు జరిపి శవరాజకీయాలు చేయడంలో ముందుండే టీడీపీ ఇప్పుడు అధఃపాతాళానికి జారిపోయే పని చేస్తుంది. బెండపూడి విద్యార్థుల ఇంగ్లీషును చూసి, ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల నోట అంత ఇంగ్లీషు రావడాన్ని చూసి సహించలేక జీతాలిచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగు చేయించిన టీడీపి దెబ్బకి… పాపం ఆ పిల్లలు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
ఇలా అభంశుభం ఎరగని పలువురు సోషల్ మీడియా రక్కసికి బలి అయిపోవడానికి కారణం ఒక్కటే… వారు ఏదో ఒక విధంగా జగన్ చేసిన మంచి పనుల వల్ల లాభం పొంది ఉండటం. ఇప్పుడు అలానే గీతాంజలి అనే మహిళ చావుకి కారణమయ్యారు. దానికీ కారణం చిన్నదే. ఆవిడకి జగన్ ద్వారా ఇంటి పట్టావచ్చింది. ఆవిడ ఏ పార్టీకి కొమ్ము కాయలేదు. ఏ నాయకుడినీ నెత్తి మీద పెట్టుకోలేదు అలానే ఏ నాయకుడిని విమర్శించలేదు. ప్రభుత్వం ద్వారా అర్హురాలైన తనకు, తన హక్కుగా వచ్చిన ఇంటి పట్టాను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేయడమే ఆవిడ జీవితంలో చేసిన మహా పాపం.
అంతే, కళ్ళకి పచ్చ కొవ్వు అడ్డంగా పేరుకుపోయిన పచ్చ మందకి అదే నేరంగా కనిపించింది. సోషల్ మీడియాలో రాబందుల్లా ఆమెను పీక్కు తిన్నారు. ఆమె నవ్వు మొహాన్ని చూడలేని ఈ ఏడుపుగొట్టు నాయాళ్ళు అయిపోయారు. రెండు రోజుల పాటు పొడిచి పొడిచి హింసించారు. అవమానం తట్టుకోలేక ఆమె ఆత్మ హత్య చేసుకుంది.
సిధ్ధం సభ గ్రాఫిక్సు అంటూ… స్వకుచమర్ధనం చేసుకుంటూ, భావప్రాప్తి పొందుతున్న పచ్చ మంద మీద ఒక్కసారిగా ఈ గీతాంజలి చావు తాలూకా పాపం పడబోయేసరికి… మళ్ళీ కొత్త హింసకి పధకం రచించారు. ఆవిడని చంపించింది ఎవరంటూ ఏకంగా.. టీడిపి అఫిషియల్ పేజీలోనే పోస్టులేసారు. పాపం తమకు అంటుకోకుండా చేయడానికి, ఆవిడ ఎప్పటి నుంచో కోమాలో ఉందంటూ పుకార్లు లేవదీస్తున్నారు. చనిపోయిన శవాన్ని పీక్కు తినడానికి మళ్ళీ రాబందులై ఆ శవం చుట్టూ ఎగురుతున్నారు.
వీడియో గతంలోదనీ, ఆవిడకి యాక్సిడెంట్ అయ్యాక బయటకు వైసీపీ వారే వదిలేరని కాసేపూ, ఆ వీడియోని టీడీపి ట్రోల్ చేసింది కాబట్టి కావాలనే వైసీపీ అనుచరులు ఆమెని చంపేశారని మరి కాసేపూ ఇలా ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటుంది. అమాయకులైన ఆమె పిల్లలను చూసి కూడా మనసులు కరగని కసాయి వాళ్ళలా టీడీపీ సోషల్ మీడియా వర్గం ప్రవర్తిస్తుంది. గీతాంజలి ఆనందాన్ని, ఆవిడనూ పచ్చ మీడియా ఎంత ద్వేషిస్తుందంటే… ఆమె చావుని తెలుసుకుని అయ్యో పాపం అనడానికి జాతీయ మీడియా కూడా వచ్చినా… ఈనాడు, ఆంధ్ర జ్యోతి మాత్రం ఆ పక్కకి కూడా తొంగి చూడటంతలా దారుణంగా ఒక సగటు మహిళని ద్వేషిస్తుంది. ఇది నా చిరకాల కోరిక అంటూ ఇంటి పట్టా తీసుకుని ఆనందంగా గీతాంజలి చెప్పడమే… ఈ రోజు టీడీపీ వాళ్ళ కడుపులు కాలడానికీ, చితిపై గీతాంజలి కాలడానికి ఏకైక కారణమయ్యింది.