బాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత డబ్బా కొట్టుకున్నా పెద్దగా ఆశ్చర్యం అనిపించదు కానీ, నీటి విషయంలో ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మాట్లాడితే మాత్రం దానంత హాస్యాస్పదం ఉండదు.. తన పధ్నాలుగేళ్ల పరిపాలనలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ తనే ప్రారంభించి తనే పూర్తి చేసిన చరిత్ర టార్చ్ లైట్ పెట్టి వెతికినా దొరకదు.. నీటి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి ఎలా ఉంటుంది అంటే:
శ్రీకాకుళంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాకి నీళ్లిచ్చాం అని అసెంబ్లీ లో బొంకితే అదే జిల్లాకి చెందిన స్పీకర్ తడుముకోకుండా ఏ ప్రాజెక్ట్ కట్టారు సార్? ఎక్కడుంది అది అని అడిగితే వెంటనే నాలుక్కర్చుకుని శ్రీకాకుళం లో నీటి పారుదలకి కృషి చేసాం అన్నా అధ్యక్ష్య అని తను పొడిచిందేమీ లేదని గుర్తొచ్చి ఫూల్ అయ్యాడు…
అర్దరాత్రులు టార్చ్ లైట్ లు వేసుకుని కమీషన్ల కోసం వెళ్లిన చరిత్ర తప్ప నీటి పారుదల గురించి కనీసం అవగాహన కూడా లేని వ్యక్తి బాబు.. వైయస్సార్ 80% పూర్తి చేసిన కాలువలకు మోటార్ లు పెట్టి పట్టిసీమ పూర్తి చేసా, నదులని అనుసంధానం చేసా అని ఇప్పటికీ ఘనంగా చెప్పుకోవడమే తప్ప తన జీవితం మొత్తంలో ఇంకో ప్రాజెక్ట్ పేరే తెలీదు బాబుకు..
వెలిగొండ ప్రాజెక్ట్ కు 1996 లో శంకుస్థాపన చేసి 2004 వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.. వైయస్సార్ సీఎం అయ్యాక 2005 లో మొదటిసారి టన్నెల్ పనులు మొదలైతే, మొదటి టన్నెల్ 2021 జనవరి 13 న పూర్తి అయింది, రెండో టన్నెల్ 2024 జనవరి 23 న పూర్తి అయింది.
మొదటి టన్నెల్ మొత్తం పొడవు 18.79km కాగా
వైయస్సార్ హయాంలో 6.97 km పూర్తి అయింది,
రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 4.61 km,
బాబు హయాం లో 4.33 km,
జగన్ హయాంలో 2.88 km పూర్తి అయింది..
ఇక రెండో టన్నెల్ విషయానికి వస్తే మొత్తం 18.787 km టన్నెల్ కాగా..
వైయస్సార్ హయాంలో: 4.56km..
కాంగ్రెస్ హయాంలో(కిరణ్&రోశయ్య): 4.18km
బాబు హయాంలో: 2.33 km.
జగన్ హయాంలో: 7.69 km.
పూర్తి అయింది..
అంటే రెండు టన్నెల్ లు కలిపి మొత్తం పొడవు 37.585 కిలోమీటర్ల టన్నెల్ లో 6.66 కిలోమీటర్ల మేరకే బాబు పనులు చేసింది.. అంటే మొత్తం ప్రాజెక్ట్ లో ఆరో వంతు మాత్రమే బాబు పూర్తి చేసింది.. ఇక జగన్ తన నాలుగేళ్ళ పాలనలోనే 10.57 కిలోమీటర్లు పూర్తి చేశాడు అంటే మొత్తం ప్రాజెక్ట్ పొడవులో 28% పూర్తి చేశాడు అంటే నాలుగో వంతు పైగా…
తన పధ్నాలుగేళ్ల పాలనలో కేవలం ఆరో వంతు పని చేసిన బాబుకు, 4.5 ఏళ్లలో అందులో రెండేళ్ల కరోనా కష్టకాలం ఉన్నా నాలుగోవంతు పూర్తి చేసిన జగన్ కు నక్కకు నకలోకానికి ఉన్న తేడా ఉంది.. తండ్రి కొడుకులకు ప్రజల నీటి కష్టం మీద ఉన్న చిత్తశుద్ది తమ 10 ఏళ్ల పాలనలో 65% ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారానే తెలుస్తుంది. బాబు 14 ఏళ్లు, కాంగ్రెస్ 5 ఏళ్ల పాలన మొత్తంగా 19 ఏళ్లలో కట్టింది మొత్తం 35% మాత్రమే…
ఇలా ఒక్క ప్రాజెక్ట్ విషయంలో అయినా బాబు అండ్ కో మేము ఇంత పూర్తి చేసాం అని చెప్పుకునే ధైర్యం ఉందా?
జగన్ కి నీటి ఘోష ఎంత పడుతుందో పక్క రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా అధికార ప్రతిపక్ష నేతలు చేసుకున్న వాగ్వాదాన్ని లైవ్ లో రెండు రాష్ట్రాల ప్రజలు చూశారు… పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి జగన్ 44000 క్యూసెక్కుల నుండి 89000 క్యూసెక్కుల కి పెంచి రాయలసీమ కి నీళ్లి తీసుకెళ్తున్నాడు అని ఆన్ రికార్డ్ అసెంబ్లీ సాక్షిగా నిరూపించింది తెలంగాణ ప్రభుత్వం..
జగన్ కుప్పం వస్తే ఖాళీ బిందెలతో నిరసన తెలపండి అని జగన్ అధికారం లోకి వచ్చిన కొత్తలో సిగ్గు లేకుండా పిలిపు ఇచ్చాడు బాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 7 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కుప్పానికి నీళ్లివ్వడం చేతకాక కొత్తగా సీఎం గా వచ్చిన జగన్ కి ఖాళీ బిందెలు చూపించమనడం సిగ్గు లేని తనం.. జగన్ మాత్రం బాబు దశాబ్దాలుగా చేయలేని పనిని కేవలం నాలుగేళ్లలో పూర్తి చేసి కుప్పం కు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీళ్లిచ్చాడు.. ఎక్కడ కుప్పం ఎక్కడ శ్రీశైలం అని తెలంగాణ అసెంబ్లీ లో ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు అంటే అర్ధం చేసుకోవచ్చు జగన్ చిత్తశుద్ధి ఏమిటని…
సొంతగా ఓ ప్రాజెక్ట్ కట్టిన చరిత్రే లేని బాబుకు నీటి ఘోష పట్టదా? అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జగన్ కు నీటి ఘోష పట్టదా? ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు.. ప్రత్యేకంగా నీటి పారుదల విషయంలో…