మైలవరం అధికార పార్టీ ఎంఎల్ఏ అయిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీ లో జాయిన్ అయ్యి కూటమి తరుపున మైలవరం టికెట్ సంపాదించారు. టీడీపీలో ఈ టికెట్ కోసం బొమ్మసాని, దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాలుగా చీలిపోయి గత సంవత్సర కాలంగా కొట్లాడుకుంటునే వున్నారు. అలాంటి చోట చంద్రబాబు నాయుడుకు వసంత కృష్ణప్రసాద్ ఒక ఆశ దీపంలా కనిపించి అటూ రెండు గ్రూపులను కాదు అని మూడో వ్యక్తి అలాగే పార్టీ కి వంద కోట్ల ఫండ్ కలిసి వస్తాయి అని వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీలోకి తీసుకొని టికెట్ కేటాయించారు. ఒక్కసారి టికెట్ ప్రకటించగానే బొమ్మసాని వర్గం బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వసంతకు సహకరించే ప్రసక్తే లేదు, నేనే పోటీ చేస్తున్నానని ప్రకటించారు. దేవినేని ఉమామహేశ్వరరావు అయితే వసంత కృష్ణ ప్రసాద్ మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు అంతటితో ఆగకుండా వసంత,చంద్రబాబు మధ్య వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అని ఆరోపణలు చేశారు.
చివరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బొమ్మసాని, దేవినేని ఉమామహేశ్వరరావును పిలిచి రాజీ చేసి వసంత కృష్ణ ప్రసాద్ కు సహకరించాలని ఆదేశించారు. ఇప్పుడు అదే ఈ ఇద్దరి నాయకులను ఆలోచనల్లో పడేసింది. మంత్రిగా, జిల్లా అధ్యక్షుడిగా టీడీపీ కోసం చంద్రబాబు నాయుడి కోసం పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావునే వాడుకొని వదిలేసాడు. చివరకు చంద్రబాబు నాయుడ్ని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు కొన్ని నెలల పాటు అదే సమయంలో వేల కోట్ల అధిపతి అయిన వసంత ను గెలిపిస్తే తన ఆర్ధిక బలంతో తనకు మైలవరం నియోజవర్గం లో అవకాశాలు లేకుండా చేస్తాడు అనే భయంతో బొమ్మసాని వసంత కృష్ణ ప్రసాద్ తో అంటీ ముట్టనట్టు తిరుగుతున్నారు అలాగే తన వర్గంతో ఎక్కడ ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు, చూస్తుంటే బొమ్మసాని వర్గం వసంతకు వెన్నుపోటు పొడవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు , వసంత కృష్ణ ప్రసాద్ కలిసి తనకు టికెట్ లేకుండా, రాజకీయ భవిష్యత్ లేకుండా తీవ్రంగా అవమానించారు అని భావిస్తున్న దేవినేని ఉమా ప్రచారంలో పాల్గొనడం లేదు. తన వర్గాన్ని కూడా దూరంగా ఉంచుతున్నారు. చూస్తుంటే దేవినేని కూడా వసంతకు వెన్నుపోటు పొడవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే మైలవరం లో తన నోటి దురుసు, డబ్బు అహంతో వసంత కృష్ణ ప్రసాద్ నెగటివ్ ను మూటగట్టుకున్నారు. టీడీపీ బీసీల పార్టీ అని చెబుతూ మైలవరంలో బీసీ సభ అని పెడితే ప్రజల నుండి, బీసీ వర్గాల నుండి కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం.