విద్య, వైద్యం, వ్యవసాయం, సున్న వడ్డీ పథకం, వైఎస్ఆర్ బీమ, ఆరోగ్య శ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న విద్యాకానుక, జల వనరుల శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలు, జగనన్న చేదోడు, కపు నేస్తం, మహిళ శిశు సంక్షేమ, వాహన మిత్ర , పంచాయతీ రాజ్, రోడ్లు – భవనాలు, అమృత్ సరోవర్, జలజీవన్ మిషన్ తదితర పథకాలు ద్వారా వేల కోట్ల రూపాయిలు లబ్ధి జరిగిందని గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ గౌతమి వివరించారు.
వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం ద్వారా 15 విడతల్లో 2.94 లక్షల మంది రైతులకు రూ.1600 కోట్లు లబ్ధి చేకూరగా వైఎస్ఆర్ ఫించన్ కానుక ద్వారా 2,94,232 మందికి రూ.712.32 కోట్లు అందజేశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మూడు విడతలో 1,48,163 మంది ఖాతాల్లో 789 కోట్లు జమ చేశారు. వైఎస్ఆర్ అసరా ద్వారా 31,360 సంఘాల్లోని 3,08,160 మంది సభ్యులకు నాలుగు విడతలో రూ.947.37 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరం లో మూడు విడతల్లో 1913 మంది లభిధరులుకు రూ. 14.73 కోట్లు అందజేశారు.జగనన్న తోడు పథకం ద్వారా చిరువ్యాపారాలు, వీధి వ్యాపారాలు, తోపుడు బండ్లు ద్వారా వ్యాపారం చేసుకునే 30,134 మందికి 37.24 కోట్లు అందజేశామని కలెక్టర్ వెల్లడించారు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 2 లక్షల 6 వేల మందికి శస్త్ర చికిత్సా కోసం రూ.450 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయగా వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా 28,653 మంది అవ్వతాతలకి కంటి పరీక్షలు నిర్వహించి వారి లో 17,620 మందికి ఉచితంగా కయి ఆద్ధలు పంపిణీ చేశారు, 5900 మంది శస్త్ర చికిత్సలు నిర్వహించామని వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గడపకు వెళ్లి అన్ని రకాల టెస్టుల చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా హెల్త్ ప్రొఫైల్ ను మైంటైన్ చేస్తోంది ప్రభుత్వం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఐదు విడతలో 9150 మంది చేనేత కుటుంబాలకు రూ. 21.96 కోట్లు ప్రభుత్వం అందజేసింది. జగనన్న చేదోడు పథకం ద్వారా నాలుగు విడతలో 54,961 మంది లబ్ధదారులకు రూ. 54.96 కోట్లను ప్రభుత్వం అందజేసింది.వైఎస్సార్ జలకళ పథకం ద్వారా 1520 మందికి ప్రభుత్వం బోర్లు వేసింది. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 606 సచివాలయం పరిధిలో రూ. 110 కోట్లు అభివృధి కార్యక్రమాలు జరిగాయి అని తెలిపారు.రోడ్లు భవనాలు డిపార్ట్మెంట్ ద్వారా 240.48 కోట్లతో 248 కిలోమీటర్ల రోడ్లు వేశామని, పంచాయితీలలో రూ 30.50 కోట్లతో 89 కిలోమీటర్లు మేర సీసీ రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేసిందని ,గ్రామీణ సడక్ యోజన ద్వారా రూ.63 కోట్లతో 127 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం జరిగింది అని కలెక్టర్ గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు.