సంవత్సరాలు మారిన బుద్ది మారదన్నట్లు టీడీపీకి రోజు రోజుకి దళితులంటే చిన్న చూపు అయిపోయింది, అధికారం లేకపోయినా అహంకారపు ధోరణి మాత్రం తగ్గట్లేదు. నిన్న చిత్తూరు కార్పొరేషన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్యపై తీవ్ర స్థాయి లో టీడీపీ వాళ్ళు ధ్వజమెత్తారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీడీపీ నేతృత్వంలో ఎక్కడపడితే అక్కడ నాసిరకం సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. వాటిపైన కూర్చుంటే ఎక్కడికక్కడ ఆ బల్లలు విరిగిపోతున్నాయి. కమీషనర్ దృష్టికి ఈ విషయం చేరగా, విచారణ చేపట్టిన కమీషనర్ , కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతులు లేవని తేలింది. కమీషనర్ ఆదేశాలు మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య వాటిని తొలగించడానికి కట్టమంచి చెరువుపై ఏర్పాటు చేసిన బల్లలు దగ్గరికి వెళ్ళారు.
వాటిని తొలగిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళిన టీడీపీ వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్యపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆ సంఘటన జరిగిన తర్వాత టీడీపీకి చెందిన సురేష్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి బెదిరింపులుకు దిగాడు. 72 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుందని, నిన్ను వదిలే ప్రసక్తే లేదని, నువ్వు ఎక్కడికి వెళ్ళిన నిన్ను వదలమని, నువ్వు దళితుడు అయితే నాకేంటి అంటూ బెదిరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన చిన్నయ్య దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళడానికి నిర్ణయించుకోగా కమీషనర్ దృష్టికి ఈ విషయం చేరింది. దీంతో సదరు వ్యక్తులు పైన పోలీసులకు పిర్యాదు ఇవ్వడానికి బాధితుడు సిద్ధం అయ్యారు. కాగా ఆ సంఘటనపై దళిత సంఘాలు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా స్థాయిలో చిన్నయ్య కు మద్దతుగా ఆందోళనలు చెప్పట్టాలని దళిత ఐక్య వేదిక నిర్ణయించింది.
గతంలో టీడీపీ నాయకులు దళితుల పైన చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే, ఎస్సీ లలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అలాగే ఎస్టి లకు తెలివి ఉండదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. టీడీపీ మంత్రిగా ఉండగా ఆదినారాయణరెడ్డి దళితులు చదువుకోరు, శుభ్రంగా ఉండరని చెప్పడం అప్పట్లో తీవ్రస్థాయి విమర్శలకు దారితీసింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ అడుగు ముందుకేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తనను అడ్డుకున్న అధికారి వనజాక్షిపై భౌతికంగా దాడికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. టీడీపీ మహిళా నేత, మహిళ కమిషన్ మాజీ ఛైర్పర్సన్ సన్నపనేని రాజకుమారి మహిళ ఎస్ఐ అనురాధని దళితులు దరిద్రులని దూషించడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బస్ లో వెళ్తున్న ఒక విద్యార్థిని నీది ఏ కులము అని టీడీపీ నేత వర్ల రామయ్య అడిగితే నాది ఎస్సీ కులం అని ఆ విద్యార్థి చెప్పగానే నీది ఎస్సి కులమైతే నీకు చదువు ఏమి వస్తుందని చులకనగా మాట్లాడారు. నారా లోకేష్ దళితులు పీకింది ఏం లేదని చులకనగా మాట్లాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది టీడీపీ నాయకులు దళితులను దూషించిన సంఘటనలనేకం ఉన్నాయి. ఇలా టీడీపీ పార్టీ ఎప్పటికప్పుడు దళితులపై తమ కక్షను, అక్కసును వెళ్లగ్రక్కుతూ వారిని అణచివేయాలన్న ధోరణిలోనే పని చేస్తుంది…