ఈ రోజు ఒకరికి చెప్పిన మాటను వదిలేసి రేపు అదే వ్యక్తికి నిన్న చెప్పిన మాటకు పూర్తి విరుద్ధంగా మరో మాట చెప్పగలడు. ఈ రోజు వ్యవసాయం దండగ అని రేపు వ్యవసాయాన్ని పండుగ చేస్తా అని చెప్పగలడు. ఈ రోజు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని రేపు ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టింది నేనే అని ప్రకటించుకోగలడు. అలా పరస్పర విరుద్ధంగా, ప్రజా వ్యతిరేకంగా బాబు ఇచ్చిన కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ చూద్దాం .
మనసులో మాట పుస్తకంలో :- 60% ఉద్యోగులు అవినీతిపరులే
మనసులో మాట పుస్తకంలో :- శాశ్విత ఉద్యోగాలు వద్దు
మనసులో మాట పుస్తకంలో :- పేదలకు ఇళ్ల పధకం ఖరీదైంది
మనసులో మాట పుస్తకంలో :- ప్రాజెక్టులు కడితే లాభంలేదు, ఎకరాకు అయ్య ఖర్చు ఎక్కువ, పన్నుల రూపంలో వచ్చేది తక్కువ.
ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే, వెతికితే వందల్లో ఉంటాయి. ఇలా అనుదినం విరుద్ధ వాఖ్యలు చేస్తూ, చెప్పిన మాట, ఇచ్చిన హామీ మీద నిలబడకుండా ప్రతి అడుగులోనూ మోసం చేసే చంద్రబాబు దుర్మార్గాలకి పరాకాష్ట 2014 మేనిఫెస్టో . ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చని బాబు మళ్ళీ ఎన్నికలకు మినీ మేనిఫెస్టో, మెగా మేనిఫెస్టో అంటూ మళ్ళీ ఎన్నికలకు సిద్దమవుతున్నాడు.
కానీ ప్రజలు ఎల్లవేళలా అమాయకులు కాదు.