ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదని, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ వస్తున్నాయి. ప్రతిపక్షాలకన్నా ఎక్కువగా ఎల్లో మీడియా జగన్ పై అక్కసుతో ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వస్తుంది. కానీ ఎల్లో మీడియా రాయకున్నా, ప్రతిపక్షాలు గుర్తించకున్నా జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎప్పటికప్పుడు ఏదొక సంఘటన ద్వారా తేటతెల్లం అవుతూనే ఉంది. తాజాగా ఇతర రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ఐపిఎస్ అధికారి […]
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో సీట్లు ఒకరికి తలిస్తే మరొకరికి వచ్చాయి. తెర వెనుక చాలా కథలు నడిచాయి. అవకాశం దక్కని వారు అభ్యర్థుల కోసం పనిచేయడం ఆపేశారు. దీంతో కేడర్ అంతా తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఆ నియోజకవర్గాల్లో శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా పర్యటిస్తున్నారు. ఆయన పరిస్థితిని చక్కదిద్దుతారా.. లేక మీ చావు మీరు చావండని గాలికొదిలేస్తారనా అనే చర్చ నడుస్తోంది. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు టికెట్ ఆశించారు. […]
దక్షిణాది రాష్ట్రాల్లో ఉజ్వలంగా వెలుగొంది, కరువు సీమలో వేలాది రైతులకు సహకారం అందించి పాడిపరిశ్రమ అభివృద్ధికి చేయూతనిచ్చిన చిత్తూరు డైరీ చతికలపడి పోవడానికి కారణం ఎవరు? 1970 లలో 12 వేల లీటర్ల సేకరణ సామర్థ్యముతో ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన డైరీ 1974-75 మధ్య కార్పొరేషన్ గా మార్చబడింది.. ఈ డైరీ కారణంగానే కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న రైతాంగం పాడి పరిశ్రమ వైపు మరలడంతో పాలసేకరణ గణనీయంగా పెరిగింది. ఈ ప్రభుత్వ డైరీ పాలవెల్లువను తట్టుకునేందుకు […]
లోకేష్ తెలుగు పాండిత్యం గురించి లోకం మొత్తం తెలిసిందే, అతని భాషతో, ప్రాంతాల పేర్లని, చారిత్రిక ప్రదేశాల పేర్లని చిత్ర విచిత్రంగా మార్చి పలుకుతూ తెలుగుని హత్య చేస్తుంటాడు . అయితే లోకేష్ కి తెలుగు భాష అబ్బకపోవటమే కాదు, తెలుగు రాష్ట్రల్లో వివిధ వర్గాలకి చెందిన ప్రజలు నిర్వహించుకొనే పండుగలు, వేడుకలు, జయంతి, వర్ధంతులకు తేడా తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడి అభాసుపాలు కావడం, ఆయా వర్గాల చేత తిట్టించుకోవడం పరిపాటిగా మారింది. అలా గతంలో ఒక […]
ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టడం.. తెలుగుదేశానికి జన స్పందన విపరీతంగా ఉందని చూపించడం ఆ పార్టీ నేతలు చాలాకాలంగా చేస్తున్న పని. గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఎన్నికల సమయంలోనూ పాత విధానాన్నే అవలంభిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాల ప్రాంగణాల్లో సభలు పెడుతుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టి.. నేతలు, కార్యకర్తల్ని తరలించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతకాలం క్రితం చంద్రబాబు కందుకూరులో సభ పెట్టారు. పర్మిషన్ […]
దేశంలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు గంభీర్ ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాగారికి నా అభ్యర్థన. నా భవిష్యత్తు క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెట్టడం కోసం దయచేసి రాజకీయ విధుల నుంచి నన్ను తప్పించాలని కోరుతున్నా. అలాగే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ప్రధానమంత్రి మోదీగారికి, […]
వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో వైద్య రంగం బలోపేతమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతోంది. కరోనా సమయంలో చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఈ–పత్రిక చైతన్య రథంలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దిక్కులేని వైద్యమంటూ కాకి లెక్కలతో కథనాన్ని వండి వడ్డించారు. సీఎంఆర్ఎఫ్ను పట్టించుకోవడం లేదని, ఆరోగ్య కోమాలో ఉందని రాసుకొచ్చారు. అయితే ఇవన్నీ అవాస్తవాలే. గత టీడీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. జగన్ హయాంలో […]
ఈ రోజు ఒకరికి చెప్పిన మాటను వదిలేసి రేపు అదే వ్యక్తికి నిన్న చెప్పిన మాటకు పూర్తి విరుద్ధంగా మరో మాట చెప్పగలడు. ఈ రోజు వ్యవసాయం దండగ అని రేపు వ్యవసాయాన్ని పండుగ చేస్తా అని చెప్పగలడు. ఈ రోజు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని రేపు ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టింది నేనే అని ప్రకటించుకోగలడు. అలా పరస్పర విరుద్ధంగా, ప్రజా వ్యతిరేకంగా బాబు ఇచ్చిన కొన్ని షాకింగ్ […]
రాం గోపాల వర్మ తల నరికి తెచ్చిచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎవరు ఇతను, ఒక వ్యక్తి తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తాననే తెంపరితనం ఎక్కడి నుండీ వచ్చింది. హత్యలు చేస్తే కోట్లు ఇచ్చే స్థాయి అతనికి ఉందా. చట్టాల్ని, వ్యవస్థల్ని తృణప్రాయంగా చూస్తూ బహిరంగంగా తలలు నరకమని ప్రోత్సాహించే ధైర్యం అతనికి ఎవరు […]
చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్వహణను నిర్వహణను నిర్లక్ష్యం చేసి ఆధ్వాన్నంగా మార్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఆఖరికి రోడ్ల పునరుద్ధరణ కోసం 2017 – 18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పారు. కాగా ఎన్నికల అనంతరం కోవిడ్ మహమ్మారి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినా రోడ్ల అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అవసరమైన చోట రోడ్లకు […]