ముందు నుండి వాలంటీర్ల మీద కక్షగట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని అవమానపరచైనా, అదిరించి బెదిరించి అయినా వారి విదులను సక్రమంగా నిర్వర్తించకుండా చేయాలని, వారు ఆడవారిని ట్రాప్ చేస్తున్నారని, ఒంటరి మహిళల సమాచారం హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ లకు ఇస్తున్నారని వాలంటీర్ల పట్ల ప్రజలలో భయాందోళనలు శృష్టించాలని తద్వారా ఆ వ్యవస్థ పై ప్రజల్లో ఉన్న సానుకూలతను వ్యతిరేఖతగా మార్చాలని శతవిధాల ప్రయత్నం చేసిన బాబు అండ్ కో వారి రాక్షస ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయారు. నానాటికి వాలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రజల్లో అశేషమైన ఆదరణ ప్రజల నుండి లభించింది.. కానీ ఎన్నికల విధుల్లో వారు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనరాదని అన్ని రకాల ప్రయత్నాలు చేసి విజయం సాధించారు, అక్కడితో ఆగకుండా ఎన్నికల కు రెండు నెలల ముందు ఒకటో తారీఖు రావాల్సిన పెన్షన్ లు ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వరాదని ఈసి ద్వారా తమ క్షుద్ర క్రతువును పూర్తి చేసిన బాబు అండ్ కో ఇప్పుడు మరో భయంకర కుట్రకు తెర తీసింది…
వాలంటీర్ వ్యవస్థను ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నుండి దూరం చేయలేరని, వారు లేకుండా పరిపాలన చేయడం కష్టం అని గ్రహించిన బాబు, తాము అధికారంలోకి వస్తే వారికి 10 వేలు పారితోషికం(పారిశోతికం) ఇస్తానని ప్రకటించాడు. పారితోషికం ఒకేసారి ఇచ్చేది, జీతం కాదది. బాబు చెప్పినదానిబట్టి ఆయన అధికారంలోకి వస్తే ఒకసారి పదివేలు గిఫ్ట్ కింద ఇస్తాడు… లేదు జీతం పెంచుతాడు జీతం అనబోయి పారితోషికం అన్నాడు అనుకున్నా అది ప్రామాదమైన వ్యూహం. తాను వాలంటీర్లకి 10 వేలు ఇస్తా అన్నాడు గానీ ఇప్పుడున్న వారిని కంటిన్యూ చేస్తా అని ఎక్కడా చెప్పలేదు. టీడీపీ అండ్ కో కంప్లైంట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో వాలంటీర్లు రాజీనామాలు చేశారు, వారెవరినీ తిరిగి వీధుల్లోకి తీసుకునే ప్రసక్తే ఉండదు. ఇక మిగిలిన వారిని కూడా విధుల నుండి తొలగించి, జగన్ మోహన్ రెడ్డి నరసింహస్వామి అవతారం ఎత్తి తన చేతులతో కడుపు చీల్చి పేగులు మెడలో వేసుకుని కాష్టాల గడ్డలో బొంద పెట్టిన అతి క్రూరమైన జన్మభూమి కమిటీలను ఈ “నారాసురుడు” తన క్షుద్ర మాయల్తో తట్టి లేపనున్నాడు.. వాలంటీర్ల స్థానే జన్మభూమి కమిటీ లను నియమించి వారిద్వారా పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందజేయాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.. జన్మభూమి కమిటీ లు మళ్లీ రాష్ట్రం మీద పడితే మిడతల దండు పడ్డ పచ్చటి పైరు గతే.. ఈ భయంకర కుట్ర నుండి ఏపీ ప్రజలు తమని తాము కాపాడుకోవాలి అంటే ఒకే ఒక ఆయుధం, వారి ఓటు…